ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ప్రతిపక్షనేత జగన్ చంద్రబాబుకు దీటుగా ప్రసంగం చేశారు. ప్ర్తత్యేక హోదా సాధించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎలాంటి నిబంధనలూ లేవన్న విషయాన్ని చెప్పారు. ప్రత్యేక హోదాతో వచ్చే లాభాలు సవివరంగా వివరించారు. ఊరికే ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వకుండా.. తన వాదనను బలపరిచేలా పార్లమెంట్  రీసెర్చ్ సెంటర్ ఇచ్చిన డేటాను చదివి వినిపించారు. 

దీనికితోడు గుజరాత్ లా కమిషన్ నుంచి తాము తీసుకున్న ఒపీనియన్ ను కూడా సభలో చదివి వినిపించారు. ఈ సమయంలో పార్లమెంట్ రీసెర్చ్ సెంటర్ కు అథెంటిసిటీ ఏమీ లేదని.. జగన్ కాకిలెక్కలు చెబుతున్నారని టీడీపీ బదులిచ్చింది. దీంతో ఒక్కసారిగా బరస్టైన జగన్ చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు ఓ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. 

చంద్రబాబు పాత జనరేషన్ మనిషని.. తాము కొత్త జనరేషన్ అని జగన్ కామెంట్ చేశారు. మేం ప్రతిదానికీ స్టడీ చేస్తాం.. ఆ తర్వాతే.. ఏదైనా సభలో చెబుతాం అని సెటైర్లు వేశారు. చంద్రబాబు తమలా స్టడీ చేయరని.. ఏదో నొటికొచ్చింది చెబుతారని కామెంట్ చేశారు.. చంద్రబాబు పాత కాలపు చదువుల మనిషని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో మంత్రి యనమల రామకృష్ణుడు లేచి జగన్ ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. 

చంద్రబాబు కూడా హోంవర్క్ చేస్తారని.. కానీ అది జనం బాగు కోసం ఉంటుందని కామెంట్ చేశారు. జగన్ చేసే హోంవర్క్.. మనీ ల్యాండరింగ్ పైనా.. జనం సొమ్ము దోపిడీ చేయడంపైనా ఉంటుందని అన్నారు. అలాగే సూట్ కేసు కంపెనీలు ఎలా పెట్టాలా.. అని జగన్, ఆయన తండ్రి గతంలో హోంవర్క్ చేశారని యనమల ఘాటుగా బదులిచ్చారు. జగన్ ప్రతి శుక్రవారం జైలు దర్శనం చేసుకుంటారని.. అందుకే తమకు జగన్ తో పోలిక వద్దని యనమల అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: