మనవాళ్లూ.. బ్రీఫ్డ్ మీ.. ఐయామ్ విత్ యూ.. డోంట్ బాదర్.. ఈ సంభాషణలు ఎక్కడో విన్నట్టుంది కదా.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు నామినేటెడ్ సభ్యుడు స్ఠీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడిన మాటలుగా చెబుతున్న సంభాషణ అది.. రేవంత్ రెడ్డి లంచాల కేసు నేపథ్యంలో అప్పట్లో ఆ టేపు రెండు రాష్ట్రాల్లోనూ మారుమోగిపోయింది. ఇప్పుడు ఆ సంభాషణలు అసెంబ్లీలోనూ వినిపించాయి. 

ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాటం విరమించారని.. అందుకు కారణం ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కోవడమేనని జగన్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. అందుకు సాక్ష్యంగా.. చంద్రబాబు టేపు సంభాషణలను జగన్ పెద్దగా చదివి వినిపించారు. దీంతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. జగన్ ను టార్గెట్ చేస్తూ పదే పదే ఆయన శుక్రవారం జైలుకు వెళ్తారని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. 

ఆ కామెంట్లకు బదులుగా.. జగన్.. ఈ ఓటుకు కోట్లు కేసును అస్త్రంగా ప్రయోగించారు. మీ పేరు 42 సార్లు చార్జ్ షీట్లో పెట్టారు సార్.. అంటూ జగన్ చంద్రబాబును ఉద్దేశించి కామెంట్ చేశారు. చంద్రబాబు సంభాషణలు  మొత్తాన్ని చదివేశారు. అప్పటివరకూ సజావుగా కాస్త అర్థవంతంగా జరిగిన సభ ఈ మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. సంభాషణతో అట్టుడికిపోయింది. 

జగన్ హాట్ కామెంట్ల తర్వాత మాట్లాడిన మంత్రి కామినేని శ్రీనివాస్, మంత్రి రావెల కిషోర్ బాబు, టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. బీజేపీ- టీడీపీ దోస్తీని విడగొట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్ కామెంట్ చేశారు.. మరోవైపు.. అసలు జగన్ ఆంధ్రాలో ఉన్నారా.. తెలంగాణలో ఉన్నారా అని ధూళిపాళ్ల ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: