ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం కూడా వాడి వేడిగా మొదలయ్యాయి. మీరు కాస్త నోరుఅదుపులో పెట్టుకోవాలి.. మీరు యువకులు, బవిష్యత్తు ఉన్నారు..కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని స్పీకర్  కోడెల అన్నారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తాను రెచ్చగొట్టడం లేదని,సబ్జెక్టు లేకుండా విపక్షం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని అన్నారు.ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతుంటే ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు రావడం సిగ్గుచేటన్నారు.

మాట్లాడేముందు వెనకా ముందూ ఆలోచించుకోకుండా మాట్లాడటం అలవాటో లేక, వ్యక్తిగత దూషణలు చేసి సభను తప్పుదోవపట్టించి.. తప్పించుకుందామని ఎత్తుగడో, అదీ కాక తనకు తెలిసిన విద్యో తెలియదు కానీ.. అన్ పార్లమెంటరీ పదాలు ప్రయోగించారు. ఇక వైఎస్ జగన్,అచ్చెంనాయుడి మద్య వాగ్వివాదం అసెంబ్లీ దద్దరిల్లేలా కొనసాగింది. టిఆర్ఎస్ తో కలిసి జగన్ కుట్రపన్నారని అన్నారు. టిఆర్ఎస్ నేతలతో జగన్ సమావేశమై కుట్ర చేశారని, ఓటు కు నోటు కేసు సృస్టించారని అన్నారు. 

అసెంబ్లీలో నువ్వా అంటే నువ్వా అనుకుంటున్న జగన్, అచ్చెంనాయుడు


ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారని ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారని ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను విమర్శించారు.ఎపి ప్రయోజనాలకు విరుద్దంగా జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ సర్కారుతో కుమ్మక్కై.. తమ నేతలను ఓటుకు నోటు కేసులో ఇరికించారన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు విపక్ష నేత జగన్ తీవ్రంగా స్పందించారు. దీనిపై జగన్ స్పందిస్తూ.."నేను.. కేసీఆర్ కు లేఖ రాస్తే.. ఆ లేఖ అచ్చెన్నాయుడు కి ఎవరు ఇచ్చారని?.. కేసీఆర్, అచ్చెన్నాయుడు కి ఇచ్చారా?" అని ఎద్దేవా చేసారు జగన్. 



మరింత సమాచారం తెలుసుకోండి: