రాజకీయల్లో కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం  ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందంటే నేను, మరో 10 మంది ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.కూడా ఏపీ ప్రత్యేక హోదాపై బాంబు పేల్చాడు.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా  ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేదని, అయితే ప్యాకేజీ ఇచ్చేందుకు మాత్రం కేంద్రం సిద్దంగా ఉందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసినా ఏపీకి ప్రత్యేక హోదా రాదని జేసీ దివాకర్రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరి స్పష్టమైందన్నారు. అధికారంలోకి రాకముందు ఒకవిధంగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా పాలకులు మాట్లాడుతున్నారంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. అయితే ప్యాకేజీ ఇచ్చేందుకు మాత్రం కేంద్రం సిద్దంగా ఉందని చెప్పారు.

ఏప్రీ ప్రత్యేక హోదా


బీహార్ కు ఇటీవలే ప్రధాని లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు అంతకంటే ఎక్కువ ప్యాకేజీనే వస్తుందని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కి కోపం ఎక్కువ కాబట్టే లేటెస్ట్ నాయకుడయ్యారన్నారు. చంద్రబాబుకు కోపం తక్కువ కాబట్టే ఔట్ డేటెడ్ నాయకుడయ్యారన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కి బీహార్ కంటే ఎక్కువ ప్యాకేజీ వస్తుంది కానీ ప్రత్యేక హోదా మాత్రం రాదని జేసీ దివాకర్రెడ్డి తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: