చంద్రబాబునాయుడు... చాలా నిస్సహాయమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిపాలన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా మన రాష్ట్రాన్ని వంచిస్తున్నదనే సంగతి ఆయనకు స్పష్టంగా తెలుసు. అలాగని... ఆ కేంద్రాన్ని విమర్శించే సాహసం మాత్రం ఆయనకు లేదు. విమర్శ కాదు కదా.. వారికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనగల స్థితిలో కూడా వారు లేరు. మంగళవారంనాడు.. కేంద్రానికి రిక్వెస్టు చేస్తూ.. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని గమనిస్తే చాలు.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నదో మనకు అర్థమవుతుంది. 


విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని, నాటి ప్రధాని సభలో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని అమలు చేయాలని తీర్మానం చేశారు. బాగానే ఉంది. కానీ ఈ సందర్భంగా.. రాష్ట్రం కోసం తానెంత కష్టపడిపోతున్నానో కూడా చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ 15 నెలల్లో 17 సార్లు దిల్లీ వెళ్లానని, ప్రధాని కేంద్రమంత్రుల్ని కలిశానని... ఆ రకంగా ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పారు. ఆయన టూరు షెడ్యూలు బాగానే ఉన్నది. 


ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లాం అనేది ముఖ్యం కాదు.. ఏం సాధించుకు వచ్చాం అనేది ముఖ్యం...! అంత చిన్న సత్యాన్ని చంద్రబాబునాయుడు ఎందుకు మిస్‌ అవుతున్నారో అర్థం కావడం లేదు. పదేపదే ఆయన నేను ఇన్నిసార్లు వెళ్లా.. అన్ని సార్లు వెళ్లా.. అని చెప్పుకుంటూ ఉంటే గనుక.. ఇప్పటిదాకా సాధించింది ఏమీ లేదని స్పష్టంగా కనిపిస్తుండగా... ఈ టూర్లు అన్నీ ఆయన అసమర్థతకు ప్రతీకలు అని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంటుందని చంద్రబాబు తెలుసుకోవాలి. ఇప్పటిదాకా చంద్రబాబునాయుడును వ్యతిరేకించే వారు కూడా.. ఆయన చిత్తశుద్ధిని అనుమానిస్తారేమో గానీ.. సమర్థతను అనుమానించరు. సగటున నెలకు ఒకటికంటె ఎక్కువసార్లు ఢిల్లీకి వెళుతున్న ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ఏమీ సాధించలేదు. అదే సమయంలో నీతి ఆయోగ్‌ సమావేశాలకు కూడా డుమ్మా కొట్టే ముఖ్యమంత్రి ఉన్న బీహార్‌ రాష్ట్రానికి 1లక్ష 75 వేల రూపాయల విలువైన ప్యాకేజీ వచ్చేసింది. దీన్ని బట్టి.. చంద్రబాబునాయుడు అసమర్థుడని అనుకోవాలా? మరింకేం అర్థాలు వస్తాయో చంద్రబాబే విడమరచి చెప్పాలి. ఇన్నిసార్లు వెళుతున్నా కూడా ఫలితం ఏం జరుగుతోంది. అందుకే ఎన్ని సార్లు వెళ్లాం అనేది కాదు అన్నయ్యా.. ఏం సాధించాం అనేది ముఖ్యం అని ఆయన తెలుసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: