పశ్చిమగోదావరి జిల్లాలో  ఇంజక్షన్ నిడిల్ తో ఓ సైకో మహిళలను టార్గెట్ చేసి మరీ గుచ్చిపోతున్నాడు.. ఇప్పటికీ ఈ సైకో బారిన పడ్డవారు 19 మందికి చేరుకున్నారు.ఇప్పటి వరకు ఒకే సైకో అనుకున్నారు కానీ పోలీసులు ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సూదులు, ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే వీరే పక్క సైకోలు అని చెప్పలేమని పోలీసులు అంటున్నారు. ఈ వారంలో సైకోలు తమ వింత ప్రవర్తనతో మహిళలను భయబ్రాంతులకు గురి చేశాడు. బైక్‌ మీద వస్తున్నాడన్నది ఇప్పటిదాకా బాధితులు చెబుతున్నమాట.పెంటపాడు మండలం గట్లపాలెంలో ఓ బాలుడికి ఇంజక్షన్ ఇచ్చి సైకో పరారయ్యాడు.

పెనుగొండ, సిద్ధాంతం, కవిటం, బుదరాయుడు చెరువు గ్రామాల్లో ఆడవాళ్లకు ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యారు. పల్సర్ వాహనంపై హఠాత్తుగా వచ్చిన ఇద్దరు యువకులు ఇంజక్షన్ చేసి మాయమయ్యారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఇంజక్షన్ తో మత్తుకమ్మి పడిపోతున్నారు మహిళలు. ఈ విషయాన్ని పోలీసులు చాలెంజ్ గా తీసుకునొ సైకో ఊహా చిత్రాన్ని తీసుకొని ఇంటింటికి తీరుగుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలను రెండు వారాలుగా గడగడలాడిస్తున్న సిరంజి సైకోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అభిజ్ఞ వర్గాల సమాచారం.వీరవాసరం పోలీసులు రెండు రోజుల క్రితమే పట్టుకొని రహస్యంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఇద్దరు వ్యక్తుల్ని వీరవాసరం పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నారట.

సైకో బారిన పడి చికిత్స పొందుతున్న బాధితులు


ఈ సైకో భాద తట్టుకోలేక ప్రజలు ముఖ్యంగా ఆడవారు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఒకవేల వచ్చినా ఎవరినైనా తోడు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే, గత రెండు రోజుల నుండి ఇలాంటి ఘటనలు ఏవీ జరగకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తే సైకో సూదిగాడిగా పోలీసులు నిర్ధారణకు వస్తున్నారు. దీనిపై త్వరలోనే పోలీసులు ప్రకటన చేసే అవకాశం ఉంది. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల సూచన మేరకు త్వరలో సైకో సూదిగాడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: