ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌నాంత‌రం తెలంగాణ లో ఆ ప్రాంత రాష్ట్ర పార్టీ తెలంగాణ రాష్ట్ర స‌మితి అధికారంలోకి రాగా, ఆంద్ర‌ప్ర‌దేశ్ లోని ఇరు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. కానీ ఇక్క‌డ తేడా ఎమిటంటే.. పార్టీలు, వారు చేసే ప‌ని, వారు నిర్వ‌హించే అభివృద్ది,  ప్రాంతాలు వేరైనా వారి పేరులో మాత్రం చంద్రుడు ఒక్క‌డే. ఒకరు చంద్ర‌బాబు అయితే మ‌రోకరు చంద్ర‌శేఖ‌ర్ రావు. ఇక వీరు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చి 16 నెల‌లు గ‌డుస్తున్నా.. అభివృద్దిలో మాత్రం చాలా తేడా ఉంది. ఒక‌రు మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటే, మ‌రోక‌రు మాత్రం హామీల‌ను గాలికొదిలేశార‌ని తాజాగా విమ‌ర్శ‌లు గుప్పుమంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు గ‌త కొంత కాలంగా ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చుకుంటూ వ‌స్తున్నారు. ఒక్కొక్కటిగా హమీలు నెర‌వేరుస్తూ ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అవుతున్నారు. మ‌రో వైపు ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మాత్రం హామీల‌ను తుంగ‌లో తొక్కుతున్నారు.

చంద్ర‌బాబు ఏపీ ని ఒక ఆద‌ర్శ రాష్ట్రం

Image result for andhra pradesh

గ‌తం కొంత కాలంగా ఏపీ ప్ర‌జ‌ల అభివృద్ది ప‌థ‌కాల అమ‌ల్లో ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న చ‌ర్చ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన ప్ర‌క‌ట‌నలు ఇంతా అంతా కాదు. అర‌చేతిలో వైకుంఠం చూపించారు. దీంతో ఏపీ ప్ర‌జ‌లు రాష్ట్రం విడిపోయినా ప‌ర్వాలేదు మా రాష్ట్రాన్ని చంద్ర‌బాబు అభివృద్ది చేస్తార‌ని భావించారు. కానీ స్వ‌ర్గాలు చూపించిన‌ బాబుగారు ఇచ్చిన వాగ్దానాలైనా అమ‌లు చేస్తారా లేదా? అని మ‌ద‌న ప‌డిపోతున్నారట‌! చంద్ర‌బాబు ఏపీ ని ఒక ఆద‌ర్శ రాష్ట్రం గా, పెట్టుబ‌డి రాష్ట్రంగా అభివృద్ది చేసి దేశంలోనే మొట్ట మొద‌టి రాష్ట్రం గా తీర్చుదిద్దుతాన‌ని ప్ర‌గాల్భాలు ప‌లికారు. కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రం అభివృద్ది జ‌ర‌గాలి దానిని అంద‌రూ కొరుకుంటారు. కానీ గొంతెమ వాగ్దానాలు మాత్రం ఇవ్వ‌డం సరికాదు. కానీ చంద్ర‌బాబు వ్య‌వ‌హారంలో ఆదే జ‌రిగింది. 

  

చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాలంటే స‌మారుగా రూ. 2.70 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా. అంత డ‌బ్బు త‌మ దగ్గ‌ర స‌మ‌కూర‌ద‌ని వార్షిక బ‌డ్జెట్ ల‌క్ష కోట్లు ప్ర‌క‌టించి సరిపెట్టుకున్నారు. ఇక ఇచ్చిన హామీల‌నైనా నెర‌వేస్తున్నారా అంటే అదీలేదు! ప్ర‌తి ప‌థ‌కం ప్ర‌క‌టించ‌డం, మొద‌లు పెట్టి మ‌ద్య‌లోనే స్టాప్ చేయ‌డం. ఇదే గ‌త 16 నెల‌లుగా ఏపీ ప్ర‌భుత్వం ప‌థ‌కాల తీరు. అంతేకాదు.. స‌రిప‌డేంత డ‌బ్బులు లేక ఏపీ ప్ర‌భుత్వం ప‌థ‌కాల్లో కోత‌లు మొద‌లుపెట్టింది. ఎన్నిక‌ల్లో ఎటువంటి నియమ, నిబంధ‌న‌లు, ఆంక్ష‌లు లేకుండా వ్య‌వ‌సాయ రుణాలు, వ్య‌వ‌సా పెట్టుబుడుల‌కు తెచ్చిన బంగారు రుణాల‌ను, డ్వాక్రా గ్రూపుల రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు, ఇప్పుడు అడ్డ‌గోలు ఆంక్ష‌ల‌న్నీ విధించ‌డంతో 80 వేల కోట్ల‌కు పైగా ఉన్న రుణాల‌ను 35 వేల కోట్ల‌కు కోత పెట్టింది.

రుణా మాఫీలో సైతం 


ఈ రుణా మాఫీలో సైతం ఇబ్బ‌డి ముబ్బ‌డి ఆంక్ష‌ల‌తో ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయ రుణాల మాఫీ 10 వేల కోట్ల రుపాయ‌లు కూడా దాట‌ని ప‌రిస్థితి ఉంది. ఇక సామాజిక పెన్ష‌న్లు పెంచి ఇస్తున్నా..గ‌తంలో ఉన్న‌వారిలో స‌గానికి పైగా కోత పెట్టారు. స‌మారుగా 5 ల‌క్ష‌ల రేష‌న్ కార్డుల‌ను సైతం ర‌ద్దు చేసింది. అంతేకాకుండా ఎన్టీఆర్ హెల్త్ కార్డుల‌ను మంజూరు చేసినా దానిపై వైద్యం చేయ‌డానికి ప్రైవేట్ ఆసుపత్రులు అంగీక‌రించ‌డం లేదు. దీంతో హెల్త్ కార్డుల వ‌ల్ల ప్రయోజ‌నం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక మిగిలిన హామీలేవీ ఇప్ప‌టికీ అమ‌లు కు నోచుకోలేదు. ఇక తాజా కేంద్ర‌ప్ర‌భుత్వం పై ఉన్న కొంత ఆశ అడియాశ‌గానే మిగిలిపోయింది. రాష్ట్రానికి వ‌చ్చే ప్ర‌త్యేక హోదా కేంద్రం చేత్తులెత్తేసింది. ఇక స్పేష‌ల్ ప్యాకేజీని ప్ర‌క‌టించిన కేంద్ర‌ప్ర‌భుత్వం ఇస్తుందా లేదా అన్న‌ది సందీగ్దంగానే ఉంది.


ఇది ఇలా ఉంటే తెలంగాణ సీఎం కే. చంద్ర‌శేఖ‌ర్ రావు అభివృద్ది ప‌థ‌కాలు మొత్తానికి మొత్తం అమ‌లు చేయ‌కున్నా.. ఒక్కొక్క‌టిగా చేసుకుంటూ మందుకు సాగుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెర‌వేర్చాలంటే  సుమారుగా 1.35 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చ‌వుతుందు. అయితే దీనికి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండా త‌న దైన శైలీలో పావులు క‌దుపుతున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను తీర్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇచ్చిన రైతుల రుణా మాఫీ ఒకేసారి అమ‌లు కాద‌ని విడ‌త‌ల వారీ గా రైతుల‌ను ఆదుకుంటున్నారు. పెన్ష‌న్ల విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌కుండా ప్ర‌తినెల అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రా అభివృద్దికి ప‌లు కొత్త ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. గ్రామాల్లో చెరువులకు నీళ్లు రావాడానికి కాలువ‌ల పుడిక‌తీత మిష‌న్ కాక‌తీయ ప‌నుల‌ను వేగ‌వంతం చేశారు. గ్రామాలే దేశానికి ప‌ట్టుకొమ్మ‌లని గ్రామాస్వ‌రాజ్యం అభివృద్ది చెందాల‌ని గ్రామ‌జ్యోతి కార్య‌క్ర‌మాన్ని ప్ర‌వేశ పెట్టి ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. చెట్లును పెంచండంటూ ప్ర‌తిగ్రామాన్ని సీఎం కేసీఆర్ క‌లియ తీరుగుతున్నారు. 


అంతేకాకుండా పెట్టుబ‌డుల‌ను ఆహ్వ‌నించ‌డంలో తెలంగాణ ప్ర‌భుత్వం స‌ఫ‌లం అయ్యింద‌నే చెప్పుకోవాలి.  ప్ర‌తిష్టాత్మ‌క టీఎస్-ఐపాస్ ను స‌క్సెస్ ను ఇచ్చింది. భార‌తదేశంలోనే నెంబ‌ర్ వ‌న్ టీ-హ‌బ్ తో తెలంగాణ రాష్ట్రం విరాజిల్లుతుంటే.. ఏపీ సీఎం చంద్రబాబు ఇప్ప‌టికి త‌ను సర్దుకోవ‌డానికే స‌మ‌యం వృదా చేస్తున్నార‌ని రాజ‌కీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి ఇద్ద‌రు చంద్రులు ముద్దుల పాల‌న ఎవరికి ఎన్ని ఓట్లు వేస్తారంటే ముమ్మాటికి తెలంగాణ సీఎం కే వేస్తామంటున్నారు తెలుగు ప్ర‌జ‌లు.


మరింత సమాచారం తెలుసుకోండి: