భారదే దేశంలో టెర్రరిస్టుల దాడులు జరగవచ్చని ఇప్పటికే ఇంటెలీజెన్స్ వర్గాలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. దేశంలోని పెద్ద పెద్ద నగరాలపై ఉగ్రవాదుల గురి ఉన్నట్లు ఇందుకు సంబంధించి కొన్ని కీలక సమాచారాలు  ఇంటెలీజెన్స్ అందినట్లు అందుకోసం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత నెలలో  పాకిస్థాన్ కి చెందిన ఉగ్రవాదులు పలు మార్లు దాడులకు తెగబడ్డారని అంతే కాదు ఇద్దరు ఆల్ ఖైదా తీవ్రవాదులు సజీవంగా పట్టుబడటం కూడా జరిగింది.

ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు అత్యాధునికమైన టెక్నాలజీని వాడుతున్నట్లు..ఆత్మాహుతి దళాలు కూడా ఏర్పడినట్లు తెలుస్తుంది. తాజాగా డ్రోన్‌ల ద్వారా ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని ముంబై పోలీసులు హెచ్చరించడంతో సైబరాబాద్ పోలీసుల ఆదేశాలతో పూర్తిగా డ్రోన్ ఫోటోగ్రఫీని నిషేధించారు.సాధారణంగా బహిరంగ సమావేశాల్లో, ముఖ్యమైన ఉత్సవాల్లో, ప్రముఖ కార్యక్రమాల్లో ఈ మధ్య డ్రోన్లతో ఫొటోలు తీసే సంప్రదాయం ఎక్కువతుంది. అయితే, ఉగ్రవాదులు ఇలాంటి డ్రోన్లను ఉపయోగించుకుని దాడులకు తెగబడే ప్రమాదం ఉందన హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో రిమోట్ సహాయంతో నడిచే డ్రోన్లు, తేలికగా ఎగిరే విమానాలు ప్రస్తుతానికి నిషేధిస్తున్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ తెలిపారు

డ్రోన్ కెమెరాతో షూటింగ్


 ఇటీవల మార్కెట్ లోకి వచ్చిన డ్రోన్ కెమెరాల ప్రభావంపై హైదరాబాద్ పోలీసులు సమావేశమై చర్చించారు.ఇటీవల వస్తున్న చిన్నచిన్న హెలికాఫ్టర్లు కూడా డ్రోన్ కెమెరాల మాదిరిగానే కన్పిస్తున్నాయి..మరి వాటిని కూడా నిషేధించారు. ప్రైవేట్ పార్టీల్లో డ్రోన్ కెమెరాల వల్ల రిమోట్ తో బాంబులు కూడా పేల్చే అవకాశముందని తెలుస్తోంది..అందుకే ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: