సీఎం చంద్రబాబునాయుడును ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇదివరలో అయితే.. చాలా ఆప్యాయంగా మామా అని పిలుచుకుంటూ ఉండేవారు. ఇదివరలో పరిస్థితి వేరు.. వారిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులు. అయినా సరే.. ఒకింత వెటకారాన్ని ధ్వనింపజేస్తూ.. చంద్రబాబునాయుడు మా మామ. మా మామ అలా చేశారు.. ఇలా చేశారు.. అంటూ జేసీ ఆయన గురించి వ్యాఖ్యానాలు చేస్తుండేవారు. అయితే ఇప్పుడు జేసీ.. తెదేపాలో చేరిపోయిన తర్వాత.. ఇలాంటి వెటకారాలు తగ్గాయి. కాకపోతే.. మంగళవారం నాడు జేసీ, తన పాత మామ గురించి మర్మం మాట్లాడుతూ చాలా కామెంట్లు రువ్వారు. 


జేసీ దివాకర్‌రెడ్డి ప్రత్యేకహోదా గురించి మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ హోదా రాబోదంటూ.. శకునం పలకడం విశేషం. చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా కోసం పోరాడాలంటే.. ఆయనకు సీఎం కుర్చీ అడ్డు వస్తున్నదనడంలో.. బహుశా వెటకారమే ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఆరోపణలు గుప్పించడం ఆవేశపడిపోవడంలో.. జగన్‌ది నేటి తరం అయితే.. చంద్రబాబునాయుడుది నిన్నటితరం అని.. ఆ కోణంలోంచి చూసినప్పుడు ఆయన అవుట్‌డేటెడ్‌ నాయకుడే అని జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. 


మామూలుగానే.. తిరుగులేని ఫైర్‌బ్రాండ్‌ ఇమేజి కలిగి ఉన్న జేసీ దివాకర్‌రెడ్డి నోటికి తెదేపాలోకి వచ్చిన తర్వాత.. చాలా వరకు తాళాలు పడిపోయినట్లు అనుకోవాలి. ఎప్పుడో ఒకసారి తప్ప.. ఆయన పెద్ద గా నోరు విప్పడం లేదు. కాకపోతే.. తాజాగా చంద్రబాబు గురించి.. కేంద్రంతో సంబంధాల కోసం ఆయన పడుతున్న తపన వల్ల హోదా దక్కకపోవడం గురించి జేసీ చెప్పడం మర్మం చెప్పడం విశేషం. తెదేపా కేంద్రమంత్రులు కాదు కదా, ఎంపీలందరూ రాజీనామా చేసినా కూడా.. ప్రత్యేకహోదా రాబోదంటూ.. జేసీ చెప్పడం గమనార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: