ఆయుర్వేద శాస్త్ర రీత్యా మూత్రపిండాల్లో రాళ్ల వ్యాధిని ‘ మూత్రాశ్మరి ’ అంటారు. వాతం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోయి ఆ తర్వాత కణాల లోపలి భాగాలపై కాల్షియం, ఫాస్ఫేట్స్‌, ఆక్సిలేట్స్‌ రసాయనాలు పేరుకొని పోయి మూత్రపిండాల్లో రాళ్లుగా పరిణామం చెందుతాయి. మూత్రపిండాల్లోని రాళ్లు కొద్ది కొద్దిగా కరిగి, మూత్రనాళంలోకి దిగి ఇరుకైన సన్నని భాగాల్లో చిక్కుకుపోతాయి.కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు తేలగానే బెంబేలెత్తిపోతారు. ఎక్కడ శస్త్ర చికిత్స అంటారోనన్న భయం మనసును కుదిపేస్తుంది. నిజానికి ఆహారపానీయాల విషయాల్లో జాగ్రత్త పడితే అసలీ సమస్యే ఉండదు.

మూత్ర పిండాలు చేసే ప్రక్రియలో సమతుల్యత లోపించినప్పుడు వ్యర్థపదార్థాలు సూక్ష్మమైన స్ఫటికాలుగా మారతాయి. ఇవి ఒకదానికొకటి అంటుకుని చివరికి రాళ్ళుగా తయారవుతాయి. ఈ రాళ్లు వెంటనే నష్టం కలిగించవు. ముందుగా అతి సూక్ష్మమైన స్పటికాలు తయారై కొన్నేళ్లు గడిచిన తరువాత ఒక రాయిగా మారతాయి. వాస్తవానికి 70 శాతం వరకు రాళ్లు మూత్రంతో పాటే బయటకు పోతాయి. మిగతా 30 శాతం మాత్రం మూత్ర పిండాలు, మూత్ర నాళాలు, పిత్తాశయం (బ్లాడర్) వీటిల్లో ఎక్కడో ఒక చోట ఉండిపోతాయి.
 

మూత్ర పిండాల్లో రాళ్లు


మూత్ర పిండంలో రాళ్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ! 

ఈ రాళ్లు ఏర్పడ డానికి మన ఆహారపు అలవాట్లే ముఖ్య కారణం. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే ముఖ్యంగా చేయవలసిన పని.

ఈ ఆహారంలో క్యాల్షియం మోతాదు తగ్గించడం, ఆక్సలేట్లు అధికంగా ఉండే చాక్లెట్లు, పాలకూర, టమాట, బీట్‌రూట్, స్ట్రాబెర్రీ ఉన్న పదార్థాలు తగ్గించాలి.

ఈ ఆరోగ్యవంతులు రోజుకు మూడు లీటర్ల నీళ్ళు తాగితే సరిపోతుంది. కానీ, కిడ్నీలో రాళ్ళు ఏర్పడిన వారు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగవలసి ఉంటుంది. అయితే, చల్లని నీరు గానీ, ఇతర చల్లని పానీయాలు గానీ తీసుకోకూడదు. ఈ క్యాల్షియం రాళ్ళు ఉన్న వారు ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి.

ఈ ప్రొటీన్లు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడకుండా నియంత్రించవచ్చు. రాళ్లను నిర్లక్ష్యం చేస్తే, వాటి పరిమాణం పెద్దదై మూత్ర విసర్జన పెద్ద సమస్యగా మారుతుంది. మూత్ర నాళం సన్నగా మారడం, ఇన్‌ఫెక్షన్లు రావడం, ఒక్కోసారి క్యాన్సర్ వ్యాధికి కూడా ఇది దారితీయవచ్చు.

 
క్యాల్షియం, ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి.  ప్రోటీన్లు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడకుండా నియంత్రించవచ్చు.

కిడ్నీలో రాళ్లు రాకుండా చేయాలంటే.. ఎక్కువగా మంచి నీళ్లు తాగాలి. ఇతర ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవటం వల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.


మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోవాలంటే.. 

 తులసీ ఆకులతో రసం చేసుకోవాలి. చెంచాడు తులసి ఆకు రసంలో అంతే తేనె కలిపి ప్రతీరోజూ ఉదయాన్నే సేవించాలి. కనీసం ఆరు నెలలు ఇలాగే చేస్చే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. 
 
కొండపిండినే పాషాణభేది అంటారు. ఈ మూలికా వేరు చూర్ణాన్ని తయారు చేసుకుని కొద్దిపాటినీటిలో కలిపి చెంచాడు తీసుకోవాలి. లేదా నేరుగా 30. మి.లీ. మూలికా వేరు రసాన్ని తాగాలి. ఇలా మూడు పూటలా తీసుకోవాలి. లేదా కొండపిండి కషాయంని ఆకు పెసర పప్పుతో కలిపి కూరగా వండుకుని తినటం అలవాటు చేసుకోవాలి. మూడు నెలల్లో కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. 
 
 ఉలవలు-ముల్లంగి ఆకులు, నీరు. ఉలవల్లో ముల్లంగి ఆకులను సన్నగా తరిగి కలపాలి. నీళ్లు బాగా పోసి ఉడికించాలి. పై నీటిని తీసి చారు చేసుకోవాలి. ఈ ఉలవచారును రోజు తాగితే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.

తెల్ల గలిజేరు వేరును నీటిలో మెత్తగా నూరాలి. ఒక కప్పు నీటిలో ఒక రోజు రాత్రంతా నాన బెట్టి ఉదయాన్నే వడబోసి తర్వాత తాగాలి. దీంతో మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: