తెలంగాణలో మద్యం పాలసీ మార్పుతో లిక్కర్ ఏర్లైపారుతుందని.. దానిని వ్యతిరేకిస్తూ చేసిన వామపక్షాల పోరాటం ఫలించింది. ప్రస్తుతానికి పాత మద్యం విధానాన్ని మాత్రమే అమలు చెయ్యాలని, కొత్త పాలసీ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నిన్నటి కేబినెట్ భేటీలో నూతన మద్యం పాలసీపై నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఈ ఏడాదికి పాత మద్యం విధానాన్నే అమలు చేస్తామని సీఎం తెలిపారు.  


తెలంగాణలో మద్యం విరివిగా లభించేలా, చవక మద్యం అందరికి అందుబాటులో ఉండేట్లు తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలనుకున్న ప్రతిపాదన మీద సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమూంది. దాంతో ప్రస్తుతానికి కేసీఆర్ ప్రభుత్వం చీప్ లిక్కర్ అమ్మకం మీద, తాజాగా తీసుకురావాలనుకున్న మద్యం పాలసీ మీద కూడా వెనక్కి తగ్గింది. చీప్ లిక్కర్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చిందన్నారు. కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.


చీఫ్ లిక్కర్


సీఎం కేసీఆర్ అధ్యక్షత సుమారు 4 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.ఇందులో భాగంగా నియోజకవర్గానికి 4వేల ఇళ్ల చొప్పున కేటాయించనున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 24 నుంచి ఆరు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.  


క్యాబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు..

డబుల్ బెడ్ రూం ప్లాట్ ల నిర్మాణానికి 3వేల900కోట్ల రూపాయలు విడుదల

మార్కెట్ కమిటీల్లో మొదటిసారిగా దేశంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్ కమిటీల్లో 50శాతం రిజర్వేషన్ అమలు

ఉద్యోగ నియమకాల్లో వయోపరిమితిని 34 నుండి 44కు పెంపు

తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ ఏర్పాటుకు ఆమోదం

తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఏర్పాటుకు ఆమోదం 

ఉద్యోగుల డీఏ మంజూరుకు, రాష్ట్ర సహకార బ్యాంకు ఏర్పాటుకు ఆమోదం 

హైదరాబాద్ లో ఉన్న ఆర్టీసీని జిహెచ్ఎంసీకి బాధ్యతలు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం

వ్యాట్ చట్టంలో మార్పులు చేయాలని టీఎస్ మంత్రివర్గం నిర్ణయం 

వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి మంత్రివర్గం తీర్మానం

వృత్తి పన్ను చట్టాన్ని రాష్ట్రానికి వర్తింపజేయాలని, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లను లాటరీ పద్ధతిన చేపట్టాలని నిర్ణయం 



మరింత సమాచారం తెలుసుకోండి: