ఉభయగోదావరి జిల్లా పోలీసులకు 'సిరంజి సైకోలు' కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిన్నటి వరకు ఈ సూది దాడులు కేవలం పశ్చిమ గోదావరికి మాత్రమే పరిమితమయ్యాయి. తాజా ఘటనతో తూర్పుగోదావరి జిల్లాలోనూ ఈ సిరంజి దాడు  నిన్నటి వరకు ఈ సూది దాడులు కేవలం పశ్చిమ గోదావరికి మాత్రమే పరిమితమయ్యాయి. జిల్లాలో ఇంజక్షన్ నీడిల్ తో వరుస దాడులకు పాల్పడుతున్న సైకోను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేశారు.
 
సూదీ సైకో ఒక్కడేనా? గ్యాంగ్ ఉందా? సూదీ గుచ్చి పారిపోయే ముఠాలో లేడీ కూడా ఉందా? నిన్న సామర్లకోటలో దాడి తర్వాత ఇలాంటి అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి.సూదీని చూస్తే గోదారి జిల్లాలు వణికిపోతున్నాయి. ఒంటరిగా నిలబడాలన్నా..బైక్‌పై ఎవరైనా తమవైపుగా వస్తున్నట్లు అనిపించినా సూదీసైకోననే జనం బెంబేలెత్తిపోతున్నారు.నాలుగు జిల్లాల పోలీసులు..రెండు ఊహాచిత్రాలు..లక్ష రూపాయాల రివార్డు. కానీ, ఆ సూదీ సైకో జాడ కనిపెట్టలేకపోయారు.  తాజాగా  సామర్లకోట పట్టణంలో బుధవారం రాత్రి 8 గంటలకు సంగీతరావు పేటకు చెందిన దుర్గాప్రసాద్‌(25) వద్దకు ఒక మోటార్‌సైకిల్‌పై ఒక పురుషుడు, స్త్రీ వచ్చి పిఠాపురం వెళ్లే దారి చెప్పాలని అడిగారు.అలా మాటల నుంచి తేరుకోకముందే బైక్‌ ఉన్న లేడీ..దుర్గప్రసాద్‌ నడుముక్కి సూదీ గుచ్చి వెళ్లిపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వారిద్దరూ మోటార్ సైకిల్‌పై పరారయ్యారు.

సైకో బారిన పడి చికిత్స పొందుతున్న బాధితులు


బాధితుడు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మహిళ పసుపు రంగు చీర ధరించిదని, పురుషుడు నలుపు కళ్లజోడుతో ఉన్నాడని బాధితుడు తెలిపాడు. తాజా దాడితో సైకో దాడికి గురైన బాధితుల సంఖ్య 20కి చేరింది. తంలో సైకోకు సంబంధించి ఓ ఊహాచిత్రాన్ని రిలీజ్ చేసిన పోలీసులు తాజాగా మరో ఊహాచిత్రాన్ని రిలీజ్ చేశారు. సైకో మొదటి ఫోటోను నరసాపురం డీఎస్పీ సౌమ్యలత మీడియాకు రీలీజ్ చేయగా…రెండో ఫోటోను భీమవరం రూరల్ పోలీసులు రిలీజ్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: