తెలుగు ఇండస్ట్రీలో తమ అభిమాన హీరోల సినిమాలు, పుట్టిన రోజు వేడుకలకు ఫ్యాన్స్ అన్నదానాలు, రక్తదానాలు ఇతర సేవా కార్యక్రమాలు చేయడం మామూలే... ఈ సందర్భంలో తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు కట్టడం అలవాటైంది. నిన్న పవన్ కళ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు... కొందరు చెట్లు నాటి సెల్పీలు కూడా దిగారు.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాత్రి పవన్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లేక్సీలు కొందరు గుర్తు తెలియన వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో పవన్ అభిమానులకు కోపం కట్టలు తెంచుకుంది. తమ అభిమాన హీరో ఫ్లేక్సీలు ధ్వంసం చేసిన విషయం తెలుసుకొని అభిమానులు ఆందోళనకు దిగారు.. ఇది రాజకీయం పరంగా చేశారా.. లేద ఇతర హీరోల అభిమానులు కావాలని చేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

 కోపోద్రిక్తులైన పవన్ అభిమానులు మాత్రం తమ ప్రతాపం చూపించారు.. ఇతర హీరోల అభిమానుల ఇళ్లపై రాళ్ల దాడులు చేశారు. దీంతో భీమవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకోన్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: