గతేడాది అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్.. వినాయక నిమజ్జనాలు ఇక నుంచి ఇందిరాపార్కులో చేస్తామని, అందులో భారీ చెరువు నిర్మిస్తామని పేర్కొన్న విషయం విదితమే. కానీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. తాజాగా హైకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది గణనాథుల నిమజ్జనం హుస్సేన్సాగర్ లోనే నిర్వహించనున్నారు.హైదరాబాద్ లో ఈసారికి వినాయక విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది.

విగ్రహ నిమజ్జనం వల్ల కాలుష్యం పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై విచారణ చేసిన హైకోర్టు నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే చేపట్టవచ్చని సూచించింది. ఆ వెంటనే వ్యర్ధ పదార్దాలను తొలగించాలని తెలిపింది. వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా నిబంధనలు పాటించాలని, ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని తేల్చి చెప్పింది.ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని తేల్చి చెప్పింది.హుస్సేన్‌సాగర్ కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆరువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది.

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ 


15 అడుగులలోపు విగ్రహాలను నిమజ్జనం చేస్తే అభ్యంతరం ఏమిటని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. వచ్చే ఏడాది నుంచి మాత్రం బెంగుళూరు, పూణె తరహాలో మరో లేక్ ఏర్పాటు చేసి నిమజ్జనం చేసుకోవాలని హైకోర్టు అబిప్రాయపడింది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏమి లేవని హైకోర్టు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కు, ఆ తర్వాత ఈ రోజుకు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ బుధవారం నాడు హిందూ చైతన్య సభ పోస్టర్ విడుదల చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: