ఏపీ అసెంబ్లీలో వాడీ వేడిగా మాటల యుద్దాలు కొనసాగాయి..  టీడీపీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.  ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా తీవ్ర విమర్శలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు అసెంబ్లీ నుంచి గురువారం నాడు వాకౌట్ చేశారు. సభలో ప్రవేశ పెడుతున్న బిల్లుల తీరు పైన వారు నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. చర్చించే వ్యవధి లేకుండా బిల్లులు పెట్టడం ఏమిటని వైసిపి ప్రశ్నించింది. వాకౌట్ అనంతరం నగరి ఎమ్మెల్యే రోజా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. సభలో టిడిపి బుల్డోజ్ చేస్తోందన్నారు.

తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. జగన్‌ను మాట్లాడనివ్వడం లేదన్నారు. ఇప్పటికిప్పుడు బుక్కులు ఇచ్చి, ఇప్పుడే ఆమోదించాలనడం ఎంత వరకు సమంజసమన్నారు.  బాబు వచ్చినప్పటి నుంచి కరువు కాటకాలు ఏపీని చుట్టుముట్టాయని అన్నారు. రైతుకోసం చంద్రన్న యాత్ర పేరు సరికాదని, చంద్రన్న కరువు యాత్ర అని పెట్టండని నగరి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా అన్నారు.  ఒకప్పుడు రైతు అంటే చిన్న చూపూ చూసిన చంద్రబాబు ఇప్పుడు ఉన్నట్టుండి రైతులపై ప్రేమ కురిపిస్తానంటే వాళ్లు నమ్మడాని సిద్దంగా లేరని రైతు సమస్యలు పట్టని చంద్రబాబు ఇలాంటి యాత్రలు చేసినా ఫలితం శూన్యమని అన్నారు.

ఏపీ అసెంబ్లీ

kodela siva prasada rao appeal to opposition in andhra pradesh assembly

 రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిది నుంచి రైతు కోసం చంద్రన్న యాత్ర పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, అందులో రుణమాఫీ లబ్దిదారుల వివరాలు తెలియచేసే బోర్డులు పెడతామని మంత్రి పుల్లారావు చెప్పిన నేపధ్యంలో రోజా ఈ విమర్శలు చేశారు. ఈ యాత్రకు చంద్రన్న కరువు యాత్ర అని పేరు పెడితే సూపర్ గా ఉంటుందని అన్నారు.రైతులు కరువుతో అల్లాడుతున్నారని ఆమె అన్నారు. ప్రజలు నిత్యావసర ధరలు పెరిగి అల్లాడుతుంటే ప్రబుత్వం చంద్రన్న యాత్రల పేరుతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోందని రోజా ద్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: