గత మూడు రోజులు గా జరుగుతున్న అసెంబ్లీలో పాలక పక్షానికి, ప్రతి పక్షానికి మాట యుద్దం నడుస్తూనే ఉంది. ఇప్పటి వరకు అసెంబ్లీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన వారు తెలుగు దేశం నుంచి అచ్చెంనాయుడు.. వైసీపీ నుంచి రోజా..వీరిద్దరు ఆయా పార్టీల తరుపు నుంచి గట్టిగా వాదిస్తున్నారు. ఈ రోజు సభలో కరువుపై చర్చ జరుగుతున్న సమయంలో ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి.

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ ప్రాజెక్టుపైన మాట్లాడుతుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ సమయంలో అచ్చెన్నాయుడు మైక్ కావాలని అడిగారు. సభాపతి ఇచ్చారు. అచ్చెన్నాయుడు వెంటనే.. వైయస్ చనిపోయిన తర్వాత వివిధ కారణాలతో మరణించిన వారిని అందరినీ, వైయస్ మృతితో మనస్తాపం చెంది మరణించారని చెబుతూ, ఆరేళ్లుగా ఓదార్పు యాత్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఏపీ అసెంబ్లీ


ఇక అచ్చెన్నాయుడు మాట తీరు చాలా కరుకుగా ఉంటుంది..ఇప్పటికే ఆయనకు స్పీకర్ పలుమార్లు కంట్రోల్ యువర్ సెల్ప్ అన్న సందర్భాలు ఉన్నాఇక ఈ రోజు అచ్చెన్నాయుడు విమర్శలు చేస్తుండగా... వ్యక్తిగత విమర్శల నేపథ్యంలో కోడెల మైక్ కట్ చేశారు. సాధారణంగా అసెంబ్లీలో మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేయడం అరుదుగా జరుగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: