తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకొని అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను అలరించిన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అంతగా హిట్స్ లేకపోయినా గత ఐదు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాన్ కి ఎక్కడ లేని క్రేజ్ వచ్చిపండింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ జల్సా చిత్రం పవన్ కెరీర్ లో మంచి మలుపు తీసుకు వచ్చింది.. తర్వాత గబ్బర్ సింగ్ తో ఓక రేంజ్ కి వెళ్లిపోయాడు.. ఇక అత్తారింటికి దారేది చిత్రంతో రికార్డుల మోత మోగించాడు.. తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు మరింత పెరిగారు.

ఇక సినిమా లతో పాటు ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ అనే పార్టీని స్థాపించాడు... కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. కానీ టీడీపీ,బీజేపీకి సపోర్ట్ చేసి పరోక్షంగా వాటి గెలుపునకు సహకరించాడు. ఈ మద్య రాజధాని భూములపై కూడా పోరాడుతున్నారు పవన్ కళ్యాన్... తాజాగా పవన్ పై సిపిఐ నేత కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.  పవన్ కళ్యాణ్ ఎపి రాజకీయాలలో ఎక్ స్ట్రా ప్లేయర్ గా ఉన్నారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ అన్ని విషయాలపై స్పందించకుండా,కొన్నిటిపైనే మాట్లాడుతున్న తీరును తప్పుపడుతూ ఈ వ్యాఖ్య చేశారు. ఆయన సమస్యలను ట్విట్టర్ల ద్వారా ప్రశ్నిస్తున్నారని సోషల్ మీడియా  గురించి పేద ప్రజలకు అంత అవగాహన ఉంటుందా..? పవన్ కళ్యాణ్ అన్ని విషయాలపై స్పందించకుండా,కొన్నిటిపైనే మాట్లాడుతున్న తీరును తప్పుపడుతూ ఈ వ్యాఖ్య చేశారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్


ప్రత్యేక హోదా విషయంలో టిడిపి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ లకు గట్టిగా నిలదీసే పరిస్థితి లేదని,ఆ రెండు పార్టీలకు పంచెలు తడుస్తున్నాయని నారాయణ అన్నారు. ఏపీలో ప్రస్తుతం వర్షాలు లేక కరువు తాండవిస్తుందని ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేల్కొని కరువు జిల్లాలను ప్రకటించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇక భారీ పరిశ్రమలు అంటూ పేద రైతుల నుంచి భూములు లాక్కోవడం సమంజసం కాదని వీటిపై పోరాటానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: