ఈ రోజుతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోయాయి.. ఈ అసెంబ్లీ సమావేశాలపై ఏపీ ప్రతిపక్షన నేత పూర్తిగా అసంతృప్తిలో ఉన్నారు. శాసనసభా సమావేశాలు 5 రోజులే నిర్వహించడం దారుణమన్నారు.  అసెంబ్లీ సమావేశాలను 15రోజులు సమావేశాలు నిర్వహించాలని కోరామనీ కానీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. అసలు ప్రజా సమస్యలే చర్చకు రాలేదని ప్రతి విషయంలోనూ వ్యక్తిగత దూషనలకు తెగబడ్డారని రౌడిల్లా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు.


వట్టిసీమపై సరైన సమాధానం చెప్పలేదు.. కరువు గురించి మాట్లాడు కల్లబొల్లి సమాధానాలు చెప్పారు.. ఇక ఆడవారిపై అన్యాయాలు జరుగుతున్నాయని రిషికేశ్వరి కేసు విషయంలో దోషనులను ఎందుకు శిక్షించలేదో.. సమాధానం లేదు.. ఎక్కువసేపు చర్చ జరగొద్దన్నది ప్రభుత్వ దుర్బుద్ధి అని విమర్శించారు.  ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా చంద్రబాబు పట్టుబడ్డారని విమర్శించారు. దేశచరిత్రలో డబ్బు ఇస్తూ దొరికిపోవడం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు.


ఏపీ అసెంబ్లీ

kodela siva prasada rao appeal to opposition in andhra pradesh assembly

ఈ కేసులో అన్ని ఆధారాలున్నాయనీ, దీనిపై అసెంబ్లీలో చర్చించకపోవడం శోచనీయమని జగన్‌ అన్నారు. బ్లాక్‌ మనీని ఓట్లు కొనేందుకు ఉపయోగించారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు.పట్టిసీమలో వాటర్ స్టోరేజీ లేనందునే వ్యతిరేకిస్తున్నామని వ్యాఖ్యానించారు. నిరుద్యోగభృతి ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు రిక్రూట్ మెంట్ కేలండర్ ఇవ్వలేదని ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: