శ్రీమంతుడు సినిమా చూసే ఉంటారు. గ్రామాల దత్తత కాన్సెప్టుకు కాస్త వినోదం మేళవించి తీసిన ఈ సినిమా అందరినీ అలరించింది. మహేశ్ బాబు సింపుల్ గా సైకిల్ తొక్కుతూ.. లుంగీ పైకి కడుతూ కూడా అందర్నీ అడ్మైర్ చేసేశారు. ఈ సినిమాలో ఓ సీన్ ట్రయిలర్స్ సమయం నుంచీ ఆకట్టుకుంది. మహేశ్ బాబును విలన్స్ చుట్టుముట్టునప్పుడు.. దత్తత తీసుకున్నానంటే డబ్బుపోసి రంగులేని వెళ్లిపోతాననుకున్నార్రా.. వీణ్నీ.. వాణ్నీ.. వీణ్ణీ.. వాడ్నీ.. వాడ్నీ.. వాడ్ని.. వీళ్లందరినీ దత్తత తీసుకున్నా.. అని చెప్పే డైలాగ్ సూపర్బ్ గా ఉంటుంది. 

ఇప్పుడు ఇదే తరహా డైలాగ్ ఆంధ్రా అసెంబ్లీలోనూ వినిపించింది. ప్రతిపక్షనేత జగన్.. ఇదే తరహా డైలాగ్ చెప్పి.. అందర్నీ అట్రాక్ట్ చేద్దామని ప్రయత్నించినట్టు కనిపించింది. ఇటీవల అసెంబ్లీలో జగన్ మాట్లాడినప్పుడల్లా కౌంటర్ గా టీడీపీ నేతలు మాట్లాడటం పరిపాటిగా మారింది. జగన్ ఒక్కసారి ఒక మాట మాట్లాడితే.. టీడీపీ నేతలు వరుసపెట్టి ఆయన్ను తిట్టేందుకు పోటీపడుతున్నారు. 

సమావేశాల చివరి రోజు.. ఇలా టీడీపీ తనను టార్గెట్ చేయడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.. ఏంటి అధ్యాక్షా..ఇది.. నేను మాట్లాడితేనేమో.. కోర్టు జ్యూడిషియరీలో ఉంది అంటారు.. అదే విషయంపై మాత్రం.. ఆయనతో.. ఈయనతో.. ఆయనతో.. ఆయనతో.. అందరితీ వరుస పెట్టి తిట్టిస్తారు.. అంటూ మహేశ్ బాబు లెవల్లో చేయి చూపిస్తూ డైలాగ్ చెప్పేశారు. ఈ ఒక్క డైలాగ్ విషయంలోనే కాదు.. మరికొన్ని అంశాల్లోనూ జగన్ ఈసారి బాడీ లాంగ్వేజ్ మార్చేశారు.. 

అసెంబ్లీ సాక్షి గా ముఖ్యమంత్రి తమను బెదిరిస్తున్నారని చెప్పేందుకు జగన్ చంద్రబాబును ఇమిటేట్ చేసిన తీరు కూడా నవ్వించింది. చంద్రబాబు పెద్ద పెద్ద కళ్లు పెట్టి.. వేలు ఇలా చూపిస్తూ బెదిరిస్తున్నారు అధ్యక్షా.. మాకు భయం వేస్తోంది అధ్యక్షా... అంటూ రెండు రోజుల క్రితం సైటైర్ వేశారు. మొత్తం మీద ప్రతిపక్షనేతగా జగన్ క్రమంగా ఇంప్రూవ్ అవుతున్నారన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: