ఈ మద్య భారత దేశంలో టెర్రరిస్టుల విధ్వంసాలు బాగా పెరిగిపోయాయి.. తాజాగా భారత్ పై ఉగ్రవాదులు దాడులు జరగడం.. ఇద్దరు ఆల్ ఖైదా ఉగ్రవాదులు సజీవంగా పట్టుబడ్డ విషయం తెలిసిందే... మన పక్కదేశం పాకిస్థాన్ ఎప్పటికప్పుడు కవ్వింపు మాటలు చెబుతూనే..మరోపక్క దాడులకు పాల్పడుతుంది. తాజాగా దేశ రాజధాని నగరం ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చి కొన్ని గంటలు గడవక ముందే మరో మహానగరం బెంగుళూరు విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది.

ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు మూడు విమానాలను వెనక్కిరప్పించారు. విమానాల్లో బాంబులు పెట్టామని వరుసగా వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ అధికారులకు తల నొప్పిగామారింది. ప్రయాణికులు సైతం హడలిపోతున్నారు.  వివమానాల్లో ఎలాంటి బాంబులు లేవని నిర్దారించుకున్న తరువాత రెండు విమానాలను తిరిగి పంపించారు.

ఇండియన్ ఎయిర్ లైన్స్

All the 156 passengers in the flight were asked to come out from the flight as soon as it landed.

కొందరు అకతాయిలు కావాలనే బాంబు బెదిరింపు ఫోన్ లు చేశారని పోలీసు అధికారులు అన్నారు. గుర్గావ్ నుంచి ఒక ఫోన్ వచ్చిందని, మిగిలిన బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, రెండు ఎయిర్ పోర్టులకు కూడా సౌత్ బెంగళూరు ప్రాంతం నుంచే ఫోన్ కాల్స్ వెళ్లినట్లు పోలీసులు దాదాపుగా నిర్ధారించుకున్నారు. నిందితుడి కోసం బెంగళూరు పోలీసులు తీవ్రంగా గాలింపు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: