భారం ఎంతగా దించుకోవాలని అనుకున్నా సరే.. ఆమెకు తప్పేలా కనిపించడం లేదు. అడ్డాల నాటి బిడ్డ కాదు.. ఇప్పుడు గడ్డాల నాటి బిడ్డడే.. కానీ తల్లికి భారం తప్పించి.. తాను బరువు మోయడానికి మాత్రం సిద్ధపడడం లేదు. ఆమెకు విముక్తి కల్పించడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని తీసుకోవడానికి రాహుల్‌ గాంధీ విముఖత చూపించారని, అందువల్లనే.. సోనియాగాంధీ పదవీకాలాన్ని ఏడాది కాలం పొడిగించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. 


రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించబోతున్నారని.. ఆయన తన సొంత టీంతో పార్టీకి పునరుత్తేజం కల్పించబోతున్నారని.. గత ఏడాది కాలంగా పుకార్లు మరియు వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. ఆయన తన టీం మొత్తాన్ని రెడీ చేసుకున్నారని.. వారంతా యువతరం ప్రతినిధులు అనీ, వృద్ధతరం మొత్తానికి ఇక కీలక పదవులనుంచి చెల్లుచీటీ ఇచ్చేయబోతున్నారని.. అంతా కలిసి కాంగ్రెస్‌ పార్టీని శరవేగంతో భవిష్యత్తులోకి తీసుకువెళ్తారని అనుకుంటూనే ఉన్నారు. ఆ టీం మొత్తం రెడీ అయింది. వృద్ధులంతా వెళ్లడానికి కూడా రెడీ అయ్యారు. కొందరు వెళ్లిపోయారు కూడా. బెంగుళూరు సమావేశాల్లోనే రాహుల్‌కు కిరీటధారణ జరుగుతుందని అంతా భావించారు. అవన్నీ వాయిదా పడ్డాయి. 


తాజాగా ఇప్పుడు సోనియా గాంధీ అధ్యక్ష పదవీకాలం ముగుస్తున్న సమయంలోనూ.. రాహుల్‌ గాంధీ మాత్రం ఆ బాధ్యత అందుకోవడానికి విముఖంగా ఉన్నట్లు సమాచారం. పార్టీని నడిపించడంలో ఆయన కీలకంగానే పనిచేస్తున్నారు గానీ.. అధికారికంగా పదవులు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. గతంలోనూ ప్రభుత్వంలో ఆయన కీలక వ్యక్తి అయినా.. మంత్రి పదవినైనా తీసుకోలేదు. అలాగే ఇప్పుడు పార్టీ పదవి కూడా తీసుకోడం లేదు. మరి.. సోనియా ఎన్నాళ్లు ఈ భారాన్ని మోయాలో ఏమిటో? uó²s“• yîÖjáÖýË @$T{Ë?


మరింత సమాచారం తెలుసుకోండి: