చంద్రబాబు నిర్వహిస్తున్నటువంటి వస్తున్నా మీకోసం పాదయాత్ర బుధవారం నాడు నిజామాబాద్ జిల్లాలో అడుడుపెట్టనుంది. దక్షణ తెలంగాణలో విజయవంతంగా ముగిసినటువంటి చంద్రబాబుపాద యాత్ర నేడు సాయంత్రం ఉత్తరతెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో అడుగు పెట్టనుంది. మెదక్ జిల్లాలో 10రోజులపాటు జరుగాల్సినటువంటి పాదయాత్ర వేగం తగ్గడంతో 11రోజుల పాటు సాగింది. ఈనెల 18న రంగారెడ్డి జిల్లానుండి పటాన్ చెరువు మండలంలోని బిడిఎల్ భానూరు గ్రామంలోకి ప్రవేశించినటువంటి పాదయాత్ర పటాన్ చెరువు నియోజకవర్గంలో పాటు సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో కొనసాగింది. మెదక్ జిల్లాలో మొత్తం 11మండలాల్లో 11రోజులపాటు బాబు పాదయాత్ర 175కిలోమీటర్లు కొనసాగింది. దీన్ని బట్టి బాబు రోజుకు 16కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేశారు. ఉదయం 11గంటల తర్వాత బయలు దేరినప్పటికిని రాత్రి 9గంటల వరకు బాబు యాత్ర సాగడంతో అనుకున్న గమ్యాన్ని ఒక్కరోజు తేడాతో చేరుకున్నారు. ఎంతో ఓపికగా ప్రజలు గుమికూడిన ప్రతిచోట 15నిమిషాలకు పైగా వారితో మాట్లాడుతూ పాదయాత్ర కొనసాగింది. కాగా బాబు పాదయాత్రతో టిడిపి శ్రేణుల్లో నూతనొత్సాహం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: