చనిపోయినటువంటి గేదే పగిలిపోయిన కుండనిండ పాలిచ్చినట్లుంది చంద్రబాబు మాటలు. పదేపదే గతాన్ని గుర్తు చేసుకోవడంకంటే జరుగబోయేదానిపై దృష్టి పెట్టడంతో కొంత ప్రయోజనం ఉంటుంది. గతంతోనే భవిష్యత్తుకు సంబందం ఉంటుందనుకొని చంద్రబాబు గతాన్ని గుర్తు చేసుకుంటుండవచ్చుగాని దాంతో సమయం వృదా కావడమే అవుతుంది. టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గూర్చి పదేపదే చంద్రబాబు చెబుతున్నారు. గతంలో కెసిఆర్ టిడిపిలో అనుభవించినటువంటి పదవుల గూర్చి గుర్తుకు తెస్తున్నారు. ఈ విషయం అందరికి తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పటికే టిడిపి నాయకులు ఎన్నోసార్లు గుర్తు చేశారు. ఇటువంటి సందర్భంలో చంద్రబాబు మళ్లీ మళ్లీ గుర్తు చేయడంతో అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రి పదవిని చేపట్టడం జరిగిందని, తెలుగుదేశంపార్టీతోనే కెసిఆర్ ఇంతటి వారయ్యారని గుర్తు చేయడం అనేది అందరికి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో గతం గూర్చి చెబితే తెలంగాణ సెంటిమెంటు ముందు పనిచేయదు. అంతేకాదు మంత్రి పదవి ఇవ్వనందుకే కెసిఆర్ టిఆర్ఎస్ స్థాపించాడని, గతంలో చంద్రబాబును ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగుడుతూ, చంద్రబాబంతటి నాయకుడు దేశంలోనే లేడని కెసిఆర్ చేసినటువంటి పొగడ్తల పత్రికల కటింగ్ లు తెలంగాణ ప్రజలకు పంపిణి చేసిన సెంటిమెంటుముందు ప్రభావం చూపకపోవచ్చు. ఇవన్ని నిజాలేకావచ్చుగాని సెంటిమెంటు ముందు నిజాలను కూడా మరిచిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: