నిత్యం మన చర్మం యువిఎ, యువిబి కిరణాలకు ఎక్స్‌పోజ్ అవుతుంది. యువిఎ కిరణాలు చర్మం లోపల డెర్మిస్‌ను దెబ్బతీసేలా లోలోపలికి చొచ్చుకు వెళ్తాయి. దీనివల్ల ముడతలు పడే ప్రక్రియ వేగవంతమవుతోంది. ఇక యువిబి కిరణాలను బర్నింగ్ రేస్ కిరణాలు అంటారు. వీటివల్ల చర్మం బాగా కమిలిపోయి కాంతి విహీనంగా తయారవుతుంది. అందుకే వీటి నుంచి సంరక్షించుకోవాలి. అందరికీ స్కిన్ ఒకేలా ఉండదు. ఒకొక్కరి చర్మం ఒక్కో రకంగా ఉంటుంది.

 పొడిచర్మం కలిగినవారు చర్మాన్ని శుభ్రపరచుకునేటప్పుడు.. పాలల్లో వెజిటబుల్ ఆయిల్‌ను వేసి బాగా కలిపి కాటన్‌తో చర్మంపై రుద్దుకోవాలి. మృదువైన చర్మం కలిగినవారైతే, ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇంకో పద్ధతిలో... పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.మాస్క్ వేసుకునేటప్పుడు... పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు.

ఇలా చేస్తే చర్మం పొడిగా ఉండదు. ఇంకా... అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది. మసాజ్ ఆయిల్, గంధం పొడి, రోజ్ వాటర్, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే... చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది. కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. చర్మవ్యాధి నిపుణులు సలహా ప్రకారం మీ ముఖాన్ని ఎక్కువగా శుబ్రం చేయరాదు, అలా చేస్తే మీ చర్మంలోని సహజమైన కణాలు పోయి, ముడతలకు దారి తీసే ప్రమాదం ఉంది.

రోజుకి 8-10 గ్లాసులు నీళ్ళు తాగడమే అని చెప్పవచ్చు.అంతే కాకుండా అన్ని చిట్కాల కన్నా ఎంతో  చౌకైన చిట్కా ఇది.నీరు ఎక్కువగా తాగడం వల్ల మీ శరీరానికి,  వ్యాధి సోకడానికి క్రిములు పుట్టించే విషము బయటకు పోయి,మీ శరీరాన్ని కాపాడుతుంది.  కలబంద తీసుకుని, దానిని ముఖానికి పట్టించాలి, ఒకవేళ మీ ఇంట్లో కలబంద లేకపోతే దగ్గర్లో ఉన్న మందుల షాపులో దొరికే కలబంద జల్ లేదా జూస్ ని కూడా ఉపయోగించుకోవచ్చు.  ఇవి సహజమైన కలబంద లాగానే ఉపయోగపడతాయి,వీటితో పాటు ఐస్ ముక్కలు తీసుకుని ముఖానికి పట్టించి, కాసేపటి తరువాత శుబ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.  

మీ రోజువారీ ఆహారంలో వెల్లుల్లి తీసుకోండి,పరిశోధకులు ప్రకారం వెల్లుల్లి  మన చర్మంలోని కణాల కాలాన్ని పెంచి, చర్మాన్ని ఎంతో తాజాగా, యవ్వనంగా ఉంచుతుంది.   నిమ్మరసం, తేనె మన చర్మ సౌందర్యానికి ఎంతో మంచిది,2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె ఈ రెంటిని కలిపి, ముఖానికి పట్టించి, ఒక 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకోవాలి, ఇలా రోజు చేస్తే మెరుగైన చర్మం పొందుతారు. రోజు లేత కొబ్బరి కాయ నీరు తాగితే మీ చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగ పడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: