చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో పాటిస్తున్న సాంప్రదాయాన్ని కెసిఆర్ తుంగలో తొక్కరా? ఆయన భేషిజాల కోసం ఏ  విషయాన్నిపెద్దగా లెక్క చేయని వారు అనే అపవాదు ఇంకా ఇంకా పెంచుకుంటున్నారా? అవును అనే సమాధానం ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు గట్టిగా నే చెబుతున్నారు. వివరాలు చూస్తే మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే కృష్ణా రెడ్డి అనారోగ్యం తో చనిపోయిన విషయం విధితమే.

ఎమ్మెల్యే కృష్ణా రెడ్డి అనారోగ్యం తో చనిపోయిన


ఆయన కాంగ్రెస్ పార్టీ కి చెందినా వ్యక్తి ఆయన మరణం తో ఖాళీ అయిన ఎమ్మెల్యే ఉప ఎన్నికలో మిగితా పార్టీలు ఎవ్వరినీ పోటీ కి దింపద్దు అనేది కాంగ్రెస్ మొదటి విజ్ఞప్తి. అది ఇవాళ నుంచీ వచ్చింది కాదు ఎప్పుడో చెప్పిన విషయమే. ఆయన మరణానికి నివాళి మరియూ సానుభూతి గా ఆయన కుటుంబసభ్యులకి టికెట్ ఇవ్వబోతున్నారు గనక ప్రతిపక్షాలు పోటీకి రావద్దు అనేది వారి కోరిక. హఠాన్మరణ సందర్భాల్లో వారి కుటుంబసభ్యులకి టికెట్టు ఇవ్వడం ఇతర పార్టీలను పోటీకి పెట్టకుండా ఏకగ్రీవం చెయ్యడం ఇది ఇప్పటి కథ కాదు ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. బై ఎలెక్షన్ సమయం లో ఇతర పార్టీలు కూడా ఏకగ్రీవంగా తప్పుకోవడం మామూలే.


అసంబ్లీ మొదలైన రోజున కిష్టారెడ్డి కి సంతాపం ప్రకటించే తీర్మాన చర్చ లో కూడా కాంగ్రెస్ ఈ విషయం తెలిపింది. నారాయణ ఖేడ్ లో మిగిలిన పార్టీ లు పోటీకి దిగద్దు అని సుముఖంగా కోరింది. కానీ కెసిఆర్ మనసంతా వీలైనంత ఎక్కువగా శాసనసభ లో తమ పార్టీ బలాన్ని పెంచుకోవడం మీదనే ఉంది అంటున్నారు. కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తి అసలు కెసిఆర్ పరిగణ లోకి తీసుకొనే లేదు అని. నారాయణ ఖేడ్ పార్టీ అభ్యర్ధిని రంగం లోకి దింపడానికి ఆయన తన వైపు నుంచి తెరాస సభ్యుడిని సిద్దం చేసేసారు. పార్టీ మంత్రులు ఇప్పటికే నారాయణఖేడ్‌లో మండలాల్లో తిష్ట వేసి అక్కడి కార్యకర్తలతో భేటీ అవుతూ.. ఉప ఎన్నికలో పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత గురించి కసరత్తు చేస్తున్నారు.


అక్కడి పార్టీ ఇంచార్జ్ భూపాల్ రెడ్డి కెసిఆర్ మనసులో అభ్యర్ధి గా దాదాపు ఓకే అయిపోయినట్టే . కాంగ్రెస్ అంతగా విజ్ఞప్తి చేస్తున్నా కెసిఆర్ ఈ విషయం లో స్పందించక పోగా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం మేరకు తీవ్ర విమర్శలు ఎదురు అవుతున్నాయి. ఆయన ఆయా పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలనే.. ఫిరాయింపులకు ప్రోత్సహించి.. తమ పార్టీలో చేర్చేసుకుంటున్నారు. అలాంటప్పుడు సానుభూతి కోసం ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు ని ఎలా తేలిగ్గా వదులుతారు అనేది రాజకీయ విశ్లేషకుల వాదన.


మరింత సమాచారం తెలుసుకోండి: