దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ఆత్మహత్య యత్నం చేయడంతో హై టెన్షన్ మొదలైంది..ఇప్పటికే ఈ కేసులు ఎన్నో కీలక మలుపులు తిరుగుతూ భారత దేశంలోనే సంచలన న్యూస్ గా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలై, స్వయానా ఆమె తల్లి అయిన ఇంద్రాణి ముఖార్జియా (43) శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఆర్థర్ రోడ్‌ జైలులో ఉన్న ఇంద్రాణి భారీ మోతాదులో ట్యాబ్లెట్లు మింగడంతో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఆమెను హుటాహుటిన జేజే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పారు.ఇరవై నాలుగుగంటలు గడిస్తే కాని ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.ఆమె ఏ తరహా నిద్రమాత్రలు తీసుకున్నారన్నదానిపై డాక్టర్లు పరీక్షలు చేస్తున్నారు. జైలులో ఇంద్రాణికి నిద్ర మాత్రలు ఎలా వచ్చాయన్నది కూడా ప్రశ్నార్ధకమే. షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణీ ముఖర్జీని...ఆగస్టు 25న అరెస్ట్‌ చేశారు. ముంబై బైకుల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటోంది.

 ఇంద్రాణిని అరెస్టు చేసి తీసుకు వెళ్తున్న దృశ్యం


2012లో ఆర్థిక కారణాలతో తన కూతురైన షీనాబోరాను మాజీ భర్తతో కలిసి ఇంద్రాణీనే హత్యచేసినట్లు పోలీసులు కేసు ఫైల్ చేశారు. మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ సాయంతో ఇంద్రాణీ..షీనాను హత్య చేసినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. ప్రస్తుతం కేసు సీబీఐ విచారణలో ఉంది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ దర్యాప్తునకు ఆదేశించారు. మరో వైపు జైలు అధికారులను ఇచ్చిన గుళికలను ఆమె నిలువ చేసుకుని మింగి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె శరీరంలోంచి సాంపిల్స్ తీసి పరీక్షలకు పంపిస్తామని చెప్పారు. ఎపిలప్సీ గుళికలు ఆమె వద్ద ఉండి ఉంటాయని, వాటిని ఆమె ఒకేసారి మింగి ఉంటుందని జెజె ఆస్పత్రి డీన్ టిపి లహనే అంటున్నారు. ఇంద్రాణికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, మరో మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: