తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి సారిగా తెలంగాణ సాదన కోసం పోరాడిన నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివంగత జి. వెంకటస్వామి (కాకా) విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ ట్యాంక్-బండ్-పై త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఈయన స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైళుకు కూడా వెళ్లివచ్చారు.. తర్వాత కాలంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.  జి. వెంకటస్వామిని  గౌరవంగా  కాకా అని పిలిచేవారు. సీనియర్ కాంగ్రెస్ నేత  ఎన్నో సేవలు చేశారు. తెలంగాణకు ఈయన చేసిన సేవలకు గుర్తుగా ట్యాంక్ బండిపై కాక విగ్రహ ప్రతిష్టకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ట్యాంక్-బండ్ సాగర్-పార్కులో కాకా విగ్రహాన్ని  ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హెచ్ఎండీఏ ట్యాంక్-బండ్-లోని సాగర్ పార్కులో విగ్రహం ఏర్పాటు చేయడానికి అనుమతిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణకు చెందిన ఒక నాయకుడి విగ్రహాన్ని ట్యాంక్-బండ్-పై ఏర్పాటు చేయాలని నిర్ణయించటం ఇదే మొదటిసారి.

తాజాగా  ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ పార్క్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడ ఉంచిన దివంగత కాంగ్రెస్ నేత కాకా  విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు యత్నించారు. అయితే తాము సూచించిన స్థలంలో కాకుండా ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా కాక విగ్రహన్ని ప్రతిష్టించాలనకుంటుందని  ఎమ్మార్పీఎస్ ఆరోపిస్తుంది. ఆ విగ్రహాన్ని అంబేద్కర్ పార్కులో ప్రతిష్టించ వద్దని వారు ఆందోళనకు దిగారు.  ఈ పరిస్థితుల్లో పోలీసులు రంగప్రవేశం చేసి, ఆందోళనకారులను అరెస్ట్ చేసి, అక్కడ నుంచి తరలించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: