ఈ మద్య ఏటీఎం క్లోనింగ్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతూ..చేబులకు చిల్లులు వేస్తున్నారు నేరగాళ్లు..  ఏటీఎం సెంటర్ల రూఫ్‌లో స్ఫై కెమెరా అమర్చుతారు. ఖాతాదారుడు కార్డు పెట్టే ఏటీఎం స్టాట్‌లో మ్యాగ్నటిక్‌ కార్డ్‌ రీడర్‌ అమరుస్తారు. ఈ కార్డు రీడర్‌ ద్వారా ఏటీఎం కార్డు క్లోనింగ్‌ను తయారుచేస్తారు. ఏటీఎంలో మన సీక్రెట్‌ పిన్‌ నంబర్‌ను పైన బిగించిన స్ఫై కెమెరా రికార్డు చేస్తుంది. దీంతో ఖాతాదారుడి కార్డు, పిన్‌ నెంబర్‌ దొంగలకు తెలిసిపోతుంది. ఇలా జంటనగరాల్లో పలు ఏటీఎంలలో వీరు నగదు అపహరించారు. 


తాజాగా కాకినాడ ఎంపి తోట నర్సింహంకు దిమ్మతిరిగే షాక్ తగిలింది..  క్రెడిట్, డెబిట్ కార్డులను క్లోనింగ్ చేసే ముఠా ఒకటి, ఆయన బ్యాంకు ఖాతా నుంచి 50 వేలు డ్రా చేసింది. కార్డు తన వద్ద వున్నా, ఖాతా నుంచి డబ్బులు మాయం కావడంతో అనుమానం వచ్చిన ఈ ఎంపీ.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మోసానికి పాల్పడిన సైబర్ నేరగాళ్ల కోసం సిఐడి గాలింపు చేపట్టింది. నిందితులు గోవాలోని ఓ ఏటిఎం నుంచి రూ. 50వేలు డ్రా చేసుకున్నట్లు తేలింది.

ఏటీఎం లో  మనీ డ్రా  చేస్తున్నపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


ఆ మద్య  రైల్వే బోర్డు మీటింగ్ కోసం ఈ ఎంపీ బెంగుళూరు వెళ్లినప్పుడు అక్కడ షాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా గోవాలోని ఓ ఏటీఎం నుంచి ఎంపీ ఖాతా నుంచి అమౌంట్ డ్రా అయినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులు డ్రా చేసిన సమయంలో తన ఖాతాలో రూ. 13లక్షలకు పైగా నగదు ఉన్నట్లు తెలిపినట్లు సమాచారం. మెసేజ్ రావడంతో వెంటనే బ్యాంకు అధికారులను సమాచారం ఇచ్చి బ్లాక్ చేయించినట్లు చెప్పారు. మరిన్ని వివరాలు సేకరించిన పోలీసులు, దుండగుల కోసం గాలింపు మొదలుపెట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: