ఇటీవల ముహూర్తాల వివాదాలు ఎక్కువవుతున్నాయి.  ప్రత్యేకించి రాజధాని విషయంలో ఇవి మరీ ఎక్కువ. గతంలో రాజధాని భూమిపూజ సమయంలోనూ అది మంచి ముహూర్తం కాదని సాక్షాత్తూ టీడీపీకి ఆస్థాన జ్యోతిష్కుడి ఉన్న సిద్దాంతే మీడియా ముందు చెప్పారు. ఇప్పుడు రాజధాని శంకుస్థాపన విషయంలోనూ అదే జరుగుతోంది. పుష్కరాల ముహూర్తంపైనా అనేక వివాదాలు వచ్చిన సంగతి తెలిసిందే. 

ఈనెల 22న దసరా పండుగ రోజు.. మధ్యామ్నం 12.35 నుంచి 12.45 మద్యలో శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహజంగా ప్రభుత్వ కార్యక్రమాల ముహూర్తాలు ఎక్కువగా టీటీడీ సిద్ధాంతులు చూస్తుంటారు. కానీ ఈ ముహూర్తం మాత్రం చంద్రబాబు పర్సనల్ జ్యోతిష్కుడు రేపల్లె సిద్దాంతి పెట్టారని అంటున్నారు. ఇది అంత మంచి ముహూర్తం కాదని పలువురు జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. 

ప్రభుత్వం నిర్ణయించిన సమయానికి కాక.. ఓ గంట ముందు నిర్వహిస్తే శుభమని ఓ జ్యోతిష్యుడు సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తం ప్రమాదకరం అంటున్నారు. అందుకు వివరణ కూడా ఇస్తున్నారు. మకర లగ్నంలో కాకుండా, ధనుర్ లగ్నంలో మూహుర్తం పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. 

ఆయనే కాకుండా ఇంకా చాలా మంది జ్యోతిష్యులు ప్రభుత్వం పెట్టిన ముహూర్తాన్ని తప్పుబడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కీలక ఘట్టాల ముహూర్తాల నిర్ణయం చాలా జాగ్రత్తగా చేయాలని సూచిస్తున్నారు. సర్కారు ముహూర్తాలు తరచూ వివాదం అవుతుండటంతో వీటి విషయంలో ఓ విధాన పరమైన నిర్ణయం తీసుకోవడం బెటర్. ప్రపంచంలో ఓ ఇద్దరు జ్యోతిష్యులూ ఒకే ముహూర్త సమయం చెప్పరని ఓ విమర్శ ఉంది. ప్రముఖ జ్యోతిష్యులతో ఓ కమిటీ వేసి.. ఈ ముహూర్తాల నిర్ణయాన్ని దానికి అప్పగిస్తే మంచిదని మరికొందరు సలహా ఇస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: