ఒక సంఘటన జరిగిందంటే.. అది యావత్‌ ప్రపంచానికి తెలియడానికి కీలక భూమిక పోషించేది.. మీడియానే. అలాగే ఒక దుర్ఘటన జరిగి దేశం మొత్తం అల్ల కల్లోలం అయిపోతుందంటే.. దానికి సంబంధించి.. విస్తృత ప్రచారం కల్పిస్తూ మూలకారణంగా నిలిచేది కూడా మీడియానే. చాలా సందర్భాల్లో వాస్తవానికి కాస్త అతిశయం జోడించి పనిచేయడం అనేది మీడియలో జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు కూడ అలాంటి పనులే చేస్తూ ఉంటారు. ఇలాంటి పోకడలతో విసిగిపోయారేమో.. ఆ గ్రామంలోని ప్రజలు మాత్రం.. 'తము మీడియా అని చెప్తున్న వారిని కూడా రాళ్లతో కొట్టి తరిమారు. అసలు తమ గ్రామంలోకి ప్రవేశించనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా.. గోమాంసం తిన్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన దాద్రీ సమీపం బిశద గ్రామంలో చోటు చేసుకున్న వ్యవహారం. 


బిశదలో జరిగిన దారుణం ఎవ్వరూ సమర్థించలేనిది. అయితే దానికి చిలవలు పలవలు జోడించి ప్రచారం చేయడం జరుగుతున్నదని ఆ గ్రామస్తుల భావన. దానికి తోడు, ఒక కుటుంబం పట్ల కొందరు దుర్మార్గులు అమానుషంగా ప్రవర్తించారనడంలో ఆ గ్రామస్తులకు కూడా ఎలాంటి సందేహం లేదు. కాకపోతే.. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తమ ఔదార్యాన్ని ఎస్టాబ్లిష్‌ చేసే ఒక మార్కెట్‌ ఎలిమెంట్‌గా వాడుకోవాలని చూసే రాజకీయ నాయకుల వైఖరి.. ఈ దుర్ఘటన నుంచి.. దేశంలో మరిన్ని చోట్ల ఇలాంటి దుర్ఘటనలు జరగడానికి 'లీడ్‌' వస్తుందేమో అని నిరీక్షించే శక్తుల వైఖరి.. ఇవన్నీ కలిసి ఆ గ్రామస్తులకు విరక్తి కలిగించాయి. 


అసలు పరామర్శల పేరుతో నాయకులు గానీ, మరెవ్వరు గానీ చొరబడిపోయి తమ గ్రామంలో ఉన్న ప్రశాంత వాతవరణాన్ని డిస్టర్బ్‌ చేయడమే వద్దంటూ వారు పట్టుబట్టినట్టుగా, కోరుకుంటున్నట్టుగా స్థానిక పోలీసులు కూడా చెబుతున్నారు. అందుకే పోలీసులు ఆ గ్రామంలోకి నాయకుల్ని అనుమతించడానికి కూడా ఆంక్షలు పెట్టారు. మీడియా వారు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు గ్రామస్తులు రాళ్లతో కొట్టి తరిమారు. మారుమూల జరిగే దురాగతాల్ని కూడా ప్రపంచానికి తెలియెజ్పే మీడియా పట్ల అనుచితంగా ప్రవర్తించడం తగదని మనక తెలుసు. కానీ.. ఆ పేరిట ఒక పల్లెలో చిచ్చు పెట్టడానికి వారు కారణం అవుతోంటే.. ఆ పల్లెకు కూడా కడుపు మండుతుందని ఈ సంఘటన బట్టి తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: