ఇది అన్నది కాంగ్రెస్ ను పూర్తిగా తన చెప్పు చేతల్లో పెట్టుకున్న వై ఎస్ కాదు, అచ్చంగా ఇప్పటి మన సిఎం కిరణే, ఆయన తన ప్రత్యర్ధులపై ఎదురుదాడికి దిగారు. కేబినేట్ నిర్ణయాలను వ్యతిరేకించే వారు రాజీనామా చేయొచ్చని , అవసరమైతే తానే తొలగిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడుతూ, కేబినేట్ తీసుకున్న నిర్ణయాలను సమిష్టి నిర్ణయాలుగా భావించాలని అన్నారు. రాజీనామా అనంతరం పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, తన నియోజకవర్గంలోని పనులను మొదటి నుంచి తన తమ్ముడే పర్యవేక్షిస్తున్నారని ఇప్పుడేమి కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదని సీఎం వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: