పైకి చాలా తక్కువ సందర్భాల్లో ప్రకటించుకున్నా, తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య రెండు రాష్ట్రాలూ విడిపోయిన నాటి నుంచే ఒక స్థాయి విభేదాలు ఖచ్చితంగా వచ్చి తీరాయి. అలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన తెలుగు రాష్ట్ర రాజకీయ నాయకులు వాటిని తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వాడేసుకున్నారు కూడా. అలాంటి విభేదాలు తొలగించడం చాలా అవశ్యం. వాటి ప్రభావం జనాలమీద తీవ్రంగా ఉండకుండా తుదిలోంచే తుంచేయ్యల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అమరావతి శంకుస్థాపన మహోత్సవం


ముఖ్యమంత్రి స్థాయి నాయకులే దీనికి పూనుకోవాల్సిన సమయం ఆసన్నం అయ్యింది. అదే "అమరావతి శంకుస్థాపన మహోత్సవం". దసరా నాడు మధ్యాన్నం జరగబోతున్న ఈ మహా రాజధాని శంకుస్థాపనకి ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచీ జపాన్, సింగపూర్ ప్రధానులు హాజరు అవుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకరరావు కూడా హాజరు అయితే ఎలా ఉంటుంది? ఇది నిజం అయితే బాగుంటుంది అని విశ్లేషకులు అంటున్నారు.


పొరుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకూ ఆహ్వానాలు పంపాలని ఆలోచిస్తున్నాం.. విదేశీ ప్రముఖుల్ని రప్పిస్తున్నాం.. అలాంటప్పుడు పొరుగునున్న మన తెలుగు రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రినే ఆహ్వానిస్తే అందులో తప్పేముంది.? అంటున్నారు వారు. అయితే ఇబ్బంది అల్లా అటు వైపు కెసిఆర్ నుంచే వస్తోందిట. ఇప్పటికే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ " ఆంధ్రోళ్లు" , " ఆంధ్రా " లాంటి మాటలు వాడుతుంటే వారికి ఆహ్వానం పంపిస్తే జనం ఏమనుకుంటారో అనేది చంద్రబాబు ఆలోచన.


కానీ బాబు ఎలాగోలా ధైర్యం చేసి ఈ ఒక్కసారికీ కెసిఆర్ ని ఆహ్వానించడం.. కెసిఆర్ కూడా పెద్దమనసు చేసుకుని ఇక్కడకి వచ్చి, నాలుగు మంచి మాటలు కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని ఉద్దేశించి చెబితే, రెండు రాష్ట్రాల మధ్య తగాదాలూ దాదాపుగా అటకెక్కేస్తాయి. తద్వారా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మీద ఇద్దరు ముఖ్యమంత్రులదీ ఒకటే మాట అని జనం లోకి వెళుతుంది. ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి మీదనే వారు ఆలోచిస్తున్నారు అని దృడ విశ్వాసం జనం లో ఏర్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: