తెలంగాణలో  ఎంఐఎం పార్టీకి మంచి పట్టు ఉంది..ఈ పార్టీ తరుపు నుంచి ఓవైసీ సోదరులు ఎప్పుడూ ఓటమి ఎరుగలేదు..ఇక మహారాష్ట్ర అసెంబ్లీ, ఔరంగాబాద్ మేయర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో బీహార్ పై కన్నేసిన ఓవైసీ సోదరులు ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రచార భాద్యతలు అక్బరుద్దీన్ ఓవైసీ స్వీకరించారు. ప్రస్తుతం ఎంఐఎం పార్టీ శాసనసభా పక్ష నేత, చంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ భాద్యతలు నిర్వహిస్తున్నారు.


తాజాగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బీహార్ ఎన్నికల ప్రచారంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి  కేసులో ఇరుక్కున్నాడు.  అయితే వివాదాస్పద ప్రసంగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి అలాంటి వివాదాల్లో చిక్కుకోవడం అక్బరుద్దిన్ కి అలవాటే..అదిలాబాద్ నిర్మల్ సభలో హిందువులు, హిందూ దేవతలుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఓవైసికి కేసు నమోదైంది.


ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఆయన మీద కేసు నమోదయింది. ఈ మేరకు బీహార్ లోని కిషన్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదయినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల మహారాష్ట్రలో రెండు సీట్లు రావడంతో బీహార్ లో కూడా ప్రభావం చూపాలని తాపత్రయ పడుతున్నారు. ఈ సమయంలో ఆయనపై కేసు నమోదు కావడంతో పార్టీ శ్రేణుల్లో కాస్త కలవరం మొదలైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: