భారత దేశంలో కళలకు.. కళాకారులకు పెట్టింది పేరు..ప్రపంచ స్థాయిలో పోటీ పడే సంగీత కళాకారులు ఎంతో మంది ఉన్నారు. ఇక గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ పేరు సంగీత ప్రియులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..బాలీవుడ్ లో వచ్చిన ‘స్లమ్ డాగ్ ’ చిత్రానికి గాను ప్రపంచ గర్వించ దగ్గ ఆస్కార్ అవార్డులు గెలిచారు. ఇక ఈ మద్య విడుదలైన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ స్థాయిలోనే రికార్డుల మోత మోగించింది..తెలుగోడి సత్తా చాటింది.. ఇప్పుడు చైనా, జపాన్ లో కూడా ఈ చిత్రం ప్రదర్శంచనున్నారు.

తాజాగా భారత్ కి చెందిన ఓ కుర్రోడు తన గిటార్ వాయిద్యంతో అమెరికన్ రికార్డులు బద్దలు కొట్టాడు. ప్రపంచంలో అత్యంత వేగంగా గిటార్ వాయించి భారతసంతతికి చెందిన నిర్వాణా బిష్త్ అనే యువకుడు ప్రపంచ రికార్డు సృష్టంచాడు. గతంలో అమెరికాకు చెందిన డేనియల్ హైగ్ అత్యంత వేంగంగా గిటార్ వాయించి రికార్డు నమోదు చేశారు..ఇప్పుడు నిర్వాణా బిష్త్ ఆ రికార్డు బ్రేక్ చేశాడు. ఉత్తరాఖండ్ లోని ముస్సోరి ప్రాంతానికి చెందిన నిర్వాణా బిష్త్, ఇక్కడి సెయింట్ జార్జ్ కళాశాలలో చదువుతున్నాడు. ఫైట్ ఆఫ్ ద బంబుల్ బీ… పాటను తాను గిటారుపై వాయిస్తుండగా తీసిన వీడియోను వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులకు ఆ యువకుడు పంపాడు.

ఫాస్ట్ గా గిటార్ వాయిస్తున్న  నిర్వాణా బిష్త్


ఆ వీడియోను పరిశీలించిన ప్రతినిధులు ప్రపంచంలో అత్యంత వేగంగా గిటార్ వాయించగల యువకుడు నిర్వాణా బిష్త్ అంటూ ధ్రువీకరించిన సర్టిఫికెట్ ను అతనికి అందజేశారు. అమెరికాకు చెందిన డేనియల్ హైగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశాడు నిర్వాణా బిష్త్ . ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు, గురువుకు ఆ యువకుడు కృతఙ్ఞతలు తెలిపాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: