తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సోమవారం సాయంత్రం నామినేషన్ల గడువు ముగిసే వరకు ఈ పదవికి విద్యాసాగర్ తప్ప ఇతరులెవ్వరూ నామినేషన్లను వేయకపోవటం.. ఎలాగూ టీఆర్‌ఎస్‌కు మెజారిటీ ఉండటంతో ఇతర పార్టీలు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాయి దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.  నేతి విద్యాసాగర్‌ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన నామినేషన్‌ పత్రాలపై కాంగ్రెస్‌, ఎంఐఎం, బీజేపీ సభ్యులు కూడా సంతకాలు చేయటం విశేషం. కాగా, మొదట కాంగ్రెస్‌ ఎమ్మెల్సీగా నేతి విద్యాసాగర్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శాసన మండలి చివరి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు.  

గతంలో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకులుగా ఎంతో కాలం పనిచేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులుగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు పనిచేశారు. తర్వాత కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన విద్యాసాగర్‌ గతంలోనూ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.


విద్యాసాగర్ ని అభినందిస్తున్న కేసీఆర్


గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హాయంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేయగా అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావుతోపాటు మండలి చైర్మన్ స్వామిగౌడ్, సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎంలు మెహమూద్ అలీ, కడియం శ్రీహరి… మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: