భౌతికశాస్త్రంలో విశిష్ట కృషి చేసిన ఇద్దరు శాస్త్రవేత్తలను ఈ ఏడాది నోబెల్‌ పురస్కారం వరించింది. టకాకి కజితా, ఆర్థర్‌ బి. మెక్‌డొనాల్డ్‌ అనే ఇద్దరు భౌతికశాస్త్రం శాస్త్రవేత్తలకు సంయుక్తంగా భౌతిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం ప్రకటించింది ద రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌. భౌతికశాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా నోబెల్ పురస్కారం దక్కింది. భౌతికశాస్త్రంలో వారు అందించిన అత్యుత్తమ సేవలకు గానూ ఈ అత్యున్నత పురస్కారం అందిస్తారు..అయితే  2015 సంవత్సరానికిగానూ భౌతికశాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది.  

న్యూట్రినోలపై పరిశోధనకు గాను వారికి ఈ అరుదైన పురస్కారం దక్కింది.టకాకి కజితా జపాన్‌లోని కషివాలో యూనివర్శిటీ ఆఫ్‌ టోక్యోలో పనిచేస్తున్నారు. ఆర్థర్‌ మెక్‌డొనాల్డ్‌ కింగ్‌స్టన్‌లోని క్వీన్స్‌ యూనివర్శిటీలో పనిచేస్తున్నారు. న్యూట్రినోస్‌కి మాస్‌ ఉంటుందని నిరూపించే న్యూట్రినో ఆసిలేషన్స్‌ కనుగొన్నందుకు వీరిరువురినీ ఈ ఏటి నోబెల్‌ వరించింది. న్యూట్రినోస్‌కి మాస్‌ ఉంటుందని నిరూపించే న్యూట్రినో ఆసిలేషన్స్‌ కనుగొన్నందుకు వీరిరువురినీ ఈ ఏటి నోబెల్‌ వరించింది.

ఈ ఏడాది తొలి నోబెల్‌ పురస్కారం మెడిసిన్‌ విభాగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నిన్న ప్రకటించారు. ఈరోజు భౌతిక రంగంలో ప్రకటించగా.. ఈ వారంలోనే రసాయన, శాంతి రంగాల్లో నోబెల్‌ బహుమతులు ప్రకటిస్తారు. ఆర్థిక విభాగంలో వచ్చే సోమవారం ప్రకటిస్తారు. టకాకి  జపాన్ దేశీయుడైన టకాకి కజితా 1959లో జన్మించారు. 1986లో ట్యోక్యో విశ్వవిద్యాలయం నుంచి పీ.హెచ్‌డీ పట్టా పొందారు. ఆర్థర్‌మెక్‌డొనాల్డ్  కెనడియన్ దేశీయుడైన ఆర్థర్‌మెక్‌డొనాల్డ్ 1949లో సిడ్నీలో జన్నించారు. కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌గా ఈయన విధులు నిర్వర్తిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: