తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోజూ కనీసం ఐదారుగురు అన్నదాతలు ఏదో ఒక ప్రాంతంలో ప్రాణాలు తీసుకుంటూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వీరి కుటుంబాలకు ఆరు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. పలువురు నాయకులు స్వచ్ఛంద సంస్థలు అన్నదాతలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. 

టీఆర్ఎస్ ఎంపీ, కేసీఆర్ కూతురు కవిత కూడా రైతుల ఆత్మహత్యలపై స్పందించారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా ఆమె విరాళాలు సేకరిస్తున్నారు. ఆమె పిలుపునకు స్పందించిన కొందరు క్రీడాకారులు, ప్రముఖులు తమకు తోచిన విరాళాలు అందిస్తున్నారు. ఓ ఎంపీగా కవిత చేస్తున్న కృషి అభినందనీయమే. అయితే దీన్ని మరో కోణంలో రాజకీయంగా వాడుకుంటున్నారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి.  

ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ కుమార్తె కవితే బయకు వచ్చి రైతుల కోసం జోలె పెట్టుకోవడం కేసీఆర్ చేతకానితనాన్ని బయటపెడుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. తన తండ్రి తాగుబోతు, చేతకాని వాడు అని కవిత ఈ విరాళాల సేకరణ ద్వారా చెప్పకనే చెప్పారని ఇటీవలే తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. 

ఏ ఇంటిలో అయిన ఆడకూతురు గడప దాటి బయటికొచ్చి విరాళాలు అడిగారంటే అర్దం ఏమిటని రేవంత్ రెడ్డి లాజిక్కు అడిగారు. రైతుల ఆత్మహత్యలను నివారించలేక పోతోందంటూ కేసీఆర్ సర్కారుపై ఎన్ని విమర్సలు చేసినా బాగానే ఉంటుంది కానీ.. ఇలా రైతు కుటుంబాలను ఆదుకుంటున్న కవితను అడ్డం పెట్టుకుని కేసీఆర్ ను తిట్టడం అంత బాగా లేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: