తెలంగాణ విభజన తర్వాత ఏపీలో చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణానికి నడుంబిగించారు..వీలైనంత త్వరగా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో విజయదశమి పర్వదినాన శంకుస్థాపన ఏర్పాటు చేసి పనులు ప్రారంభించనున్నారు. ఈ శంకుస్థాన అంగరంగ వైభవంగా..కనీవినీ ఎరుగని రీతిలో చేయాలని తలంచారు..ఇందుకోసం అప్పుడే పనులు ప్రారంభించిన అమరావతి శంకుస్థాపన కమిటీ కూడా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.  

తెలంగాణలోని హైద్రాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు, చంద్రబాబు తన పాత మిత్రుడు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని స్వయంగా ఆహ్వానిస్తే, అమరావతి శంకుస్థాపనకు హాజరైతే.. వివిధ కారణాలతో తెలుగు ప్రజల మధ్య, తెలుగు రాష్ట్రాల మధ్య పెరిగిన విభేదాలు చల్లారాలంటే, ముఖ్యమంత్రుల స్థాయిలో సహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని అందరూ భావిస్తున్న సందర్భం రానే వచ్చింది.  

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును ఆహ్వానిస్తామని శంకుస్థాపన కమిటీ చైర్మన్ పీ నారాయణ తెలిపారు. శంకుస్థాపన ఏర్పాట్లపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌తోపాటు తెలంగాణ ముఖ్యనేతలు, వీఐపీలను పిలుస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే  ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.  

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఊహాచిత్రం


రాష్ట్రాలుగా విడిపోయినా, ప్రజలుగా కలిసే వుందాం.. అన్నదమ్ముల్లా వుందాం..’ అని తెలంగాణ ఉద్యమ కాలంలో చెప్పిన కేసీఆర్‌, ఆ మాటకు కట్టుబడి, అమరావతి శంకుస్థాపనకు హాజరవ్వాలనే కోరుకుందాం. అంతకన్నా ముందు, చంద్రబాబు బేషజాలకు పోకుండా తెలంగాణ ముఖ్యమంత్రిని స్వయంగా ఆహ్వానించాలనే ఆశిద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: