ఇవాళ నుంచీ గుంటూరు లో ప్రత్యెక హోదా కోసం రంగం లోకి దిగిన జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చెయ్యబోతున్నారు. అనుమతుల నిరాకరణ లాంటి ఇబ్బందులని దాటుకుని మొత్తానికి ఒక రోజుని ఖరారు చేసుకుని పోయిన నెల చెయ్యాల్సిన దీక్ష ని ఇప్పుడు మొదలు పెడుతున్నారు .. జగన్ దీక్ష సాధ్యాసాధ్యాలు చూద్దాం :: 

జగన్ " ప్రత్యేక హోదా" దీక్ష - 9 సాధ్యాసాధ్యాలు 


1. దీక్షల విషయం లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫలితం దిశగా జగన్ మోహన్ రెడ్డి వెళుతున్నారు, కొన్ని సార్లు ఆయన దీక్ష చెయ్యడానికంటే ముందే ప్రభుత్వం ఆయన దీక్ష చెయ్యబోయే " అంశం " మీద స్పందించి జనాలకి ఆ విషయం లో ఎలాంటి ఇబ్బందీ లేదు అనే సంకేతాలు పంపించడానికి ప్రయత్నాలు చేస్తోంది 

2. దీక్ష ప్రారంభం కావడానికి మొన్న అడ్డుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అలా అడ్డుకునే ప్రయత్నం చెయ్యకపోవచ్చు అనిపిస్తోంది, అలా చేయడం ద్వారా, జగన్ దీక్షకు ప్రభుత్వం భయపడుతోందన్న సంకేతాలు జనంలోకి వెళ్లే ప్రమాదం వుంది. అది బాబు కి ససేమిరా ఇష్టం లేదు

3. దీక్ష చేస్తూ తాము పత్యేక హోదా విషయం లో ఎంతగా కట్టుబడి ఉన్నాము అనే విషయాన్ని జగన్ ప్రజలకి తెలపడం మినహా ఈ దీక్ష వల్ల భారీ ఉపయోగాలు కనపడ్డం లేదు, ప్రత్యేక హోదా విషయం లో జగన్ పూనుకున్న మొట్ట మొదటి దీక్ష ఇదే కావడం తో దీక్ష కారణంగా కేంద్రం దిగి వచ్చేస్తుందని భావించడం కూడా తప్పే అవుతుంది. కేవలం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి చెక్ చెప్పే ఉద్దేశంలో వుంటే తప్ప, దిగిరావడం అనేది కలలో మాట.

4.దీక్ష  లక్ష్యం "ప్రత్యేక హోదా" కావచ్చు కానీ మొట్ట మొదటి సారి ఆ అంశం మీద చేస్తున్న దీక్ష కాబట్టి ఒకే సారి ఇది అయ్యే పని కాదు, ఈ విషయం మీద దృడంగా ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం లో ప్రతిపక్షం సఫలం అయితే ఇంకా ఎక్కువ దీక్షలు, ధర్నాలూ చేపట్టి "ప్రత్యేక హోదా" అంశాన్ని చక్కగా వాడుకుని ప్రజలకి దగ్గర అవ్వడానికి ఇది సులభమైన పద్దతి. 

5. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చెయ్యలేము అని చేతులు ఎత్తేసిన తరుణం లో బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టు లో ఉంది, దీంతో మోడీ ప్రభుత్వానికి జగన్ ముక్కుసూటిగా వ్యతిరేకంగా వెళ్ళడం మోడీ ప్రధాని అయిన తరవాత ఇదే మొదటిసారి గా కనిపిస్తోంది. 

6. ఈ దీక్ష ప్రత్యేక హోదా కి సంబంధించినది అయిన ఇలాంటి వత్తిళ్ళు ఎన్నో తెచ్చి హోదా కాకపోయినా కనీసం ప్రతిపక్ష వత్తిడి వలన ప్రజలకి మంచి ప్యాకేజీ లు తీసుకుని రావాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వం మీద పడుతుంది.

7. మహా జరిగితే మూడు లేదా నాలుగు రోజులు దీక్ష నడుస్తుంది, ఇలోగా జగన్ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. దీన్ని అదనుగా తీసుకుని ఆసుపత్రికి చేర్చి దీక్ష విరమింపచేసే అవకాశం వుంది. అక్కడతో విషయం అగుతుంది. దీని వలన జగన్ కి ప్రత్యేక హోదా మీద పోరాడారు అని మార్కులు పడతాయి. 

8. ఈ దీక్ష జరిగిన  పక్షం రోజులకో, నెల రోజులకో కేంద్రం ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకుంటుంది అనుకుందాం ప్యాకేజీ ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద ఆయన తదుపరి దీక్ష కి దిగాల్సిన అవసరం ఉంది. ఆ ప్యాకేజీ క్షీణం గా ఉంటే మరొకసారి దీక్ష అంటూ రంగం లోకి దిగుతారా లేక విమర్సల తో సరిపెడతారా అనేది ప్రశ్న. 

9. ఒత్తిడి తేవడం తప్ప జగన్ దీక్ష తో అద్భుతాలు సాధ్యం అవుతాయి అని పార్టీ శ్రేణులు కానీ, ప్రజలు కానీ అనుకోవడం లేదు. అలా నిజంగా అద్భుతాలు సాధ్యపడితే, అది చరిత్రలో నిలిచిపోయే అద్భుతం అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: