మనవాళ్ళ దృక్పదం ఎప్పుడూ ఎవ్వరో వస్తారు ఏదో చేస్తారు అన్నట్టుగానే ఉంటుంది, గాంధీ - నేతాజీ - భగత్ లాంటి వారు పుట్టి ఉండకపోతే ఇంకా దేశానికి స్వతంత్రం వచ్చి ఉండేది కాదు అన్న చందాన ఉంటారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ కష్టాలు పక్కకి పెట్టి ఎవరో నాయకుడు రావాలి కదా ఇంకా రాలేదు ఏంటి అన్నట్టుగా ఎదురు చూస్తూ దశాబ్దాలు దశాబ్దాలు గడిపేస్తారు. వాళ్ళ తరఫున ఒక భారీ నాయకుడు వస్తే కానీ ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యలేని పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అంతా ఒకటై సమిష్టి గా పోరాడడం మానేసి ఆ నాయకుడి మీద ఆధారపడడం అనే చెడ్డ గుణం మానలేకపోతున్నారు. 

పవన్ కళ్యాణ్ రావాలి ఉద్యమం చెయ్యాలి అంటూ


విషయం ఏంటంటే తమిళనాడు ప్రభుత్వం కొత్తగా చేపట్టి "తెలుగు" రద్దు కార్యక్రమం ఆ మధ్య చాలా సంచలనం రేపింది. తమిళనాడు రాష్ట్రం లో తమిళుల తరవాత అత్యంత అధిక జనాభా గా ఉన్న తెలుగు కుటుంబాల వారు  తమ పిల్లల విషయంలో వారి చదువుల విషయం లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతా ఇదెక్కడి అన్యాయం అంటూ తమలో తామే గొణుగుతున్నారు తప్ప ఒక తెలుగు గుంపుగా ఏర్పడి ప్రశ్నించడం లేదు. అక్కడుండే ఏ ఒక్క తెలుగు సంఘమూ అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి తమకు ప్రభుత్వ నిర్ణయం పట్ల వున్న విముఖతను తెలియపరచడం లేదు. ఏంటో ఈ విషయం లో లేచిన ఒక పుకారు ఆధారం చేసుకుని పవన్ కళ్యాణ్ రావాలి ఉద్యమం చెయ్యాలి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.


ఆ మధ్య తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నాక పవన్ కళ్యాణ్ అక్కడకి వచ్చి ధర్నా చెయ్యబోతున్నాడు అని రూమర్లు వచ్చాయి. ఇక అది పట్టుకుని అతను వచ్చే రోజు కోసం ఎదురు చేస్తున్నారు. సొంత కాళ్ళమీద నిలబడే మనస్తత్వాలు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ రావాలి లేదా మరెవరో రావాలి లాంటి భావనల తో బతకడం చాలా ప్రమాదకరం అంటున్నారు పరిశీలకులు.

ఆ మధ్య హైదరాబాదులో యువత ఒక సమావేశం పెట్టి తమిళనాడులో తెలుగు భాషను పరిరక్షించుకోవడానికి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కలసి పనిచేయాలని కోరారు. వారు అన్నది బాగానే ఉండచ్చు కానీ అక్కడ తెలుగు కాపాడే విషయం లో అక్కడి వారు కాస్త ముందు అడుగు వేసి ఉద్యమం లేవదీస్తే ఎవరైనా సహకరించి ముందుకు వస్తారు ఇక్కడ నుంచే ఉద్యమం లేపి అక్కడకి వెళితే నవ్విపోదురుగాక !



మరింత సమాచారం తెలుసుకోండి: