ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బీహార్ ఎన్నికల ప్రచారంలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి  కేసులో ఇరుక్కున్నాడు.  అయితే వివాదాస్పద ప్రసంగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి అలాంటి వివాదాల్లో చిక్కుకోవడం అక్బరుద్దిన్ కి అలవాటే..గతంలో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ హిందూమతంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.


బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం కిషన్ గంజ్ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సహా బీజేపీ నేతలపై అక్బరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు బీహార్ లోని కిషన్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదయినట్లు అధికారులు తెలిపారు.


ఇటీవల మహారాష్ట్రలో రెండు సీట్లు రావడంతో బీహార్ లో కూడా ప్రభావం చూపాలని తాపత్రయ పడుతున్నారు. తాజాగా ఎమ్.ఐ.ఎమ్ నేత, తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అరెస్టుకు బీహారు లోని కిషన్ గంజ్ ఎస్పి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఆయనకు అరెస్టు వారంట్ జారీ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: