అధికారం చేపట్టి పాలనలోకి వచ్చిన అతితక్కువ సమయం లోనే ఎక్కువ దేశాలు పర్యటించిన ప్రధానమంత్రి గా నరెంద్రమోదీ ఇప్పటికే భారీ రికార్డు స్థాపించారు. ఏ ప్రధానీ పర్యటించనంత ముమ్మరంగా ఆయన విదేశీ పర్యటనలు సాగుతున్నాయి. మోడీ విదేశీ పర్యటనల సంగతి సరే కానీ స్వదేశ పర్యటనల సంగతేంటి? అంటున్నారు జనాలు అదేనండీ భారత దేశం లో ఆయన ప్రధాని అయ్యాక పర్యటించిన రాష్ట్రాల లిస్టు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది.

బీహార్ ఎన్నికలు దగ్గరపడడం


ఈ లెక్క చెప్పమంటే సొంత పార్టీ వాళ్ళు కూడా నీళ్ళు నమిలే పరిస్థితి ఉంది అని చెబుతున్నారు పరిశీలకులు. ఆయన ప్రధాని అయిన ఈ పదిహేను నెలల సమయం లో ఒక ఇరవై పర్యటనలు చేసి ఉంటారేమో, ఇప్పుడు బీహార్ ఎన్నికలు దగ్గరపడడం ఉత్తర భారత దేశం లో బీహార్ కాస్త పెద్ద రాష్ట్రము కావడం అక్కడ పర్యటనలు చేసి ఓట్లు పడేలాగా చేసే బాధ్యత తన నెత్తిమీద పెట్టుకున్నారు మోడీ.


కనీసం పది ట్రిప్పులు బీహార్ కి గత రెండు నెలల కాలం లో పడ్డాయి అంటే పరిస్థితి అర్ధం చేసుకోవాలి. ఒకటి కాదు రెండు కాదు ఓటు బ్యాంకు కోసం రాబోతున్న ఎన్నికల నగారకై లక్షా డబ్భై ఐదు వేల కోట్ల ప్యాకేజీ ని ప్రకటించిన మోడీ ఏమనుకున్నారో ఏమో అది సరిపోదేమో అన్నట్టు మళ్ళీ మళ్ళీ ప్రచారాలకు అడుగు పెడుతున్నారు స్వయంగా. బీహార్ లో ఐదు దశలలో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది, కనీసం ఐదు విడతలకు గాను పది రోజుల పాటు బీహార్ కు కేటాయించడానికి మోడీ అంతా సిద్దం చేసుకున్నారు అన్న మాట. ప్రతీ రెండు రోజుల్లో ఆయన మూడు మూడు ప్రాంతాల చొప్పున రోజుకి ఆరు ఏడు ప్రదేశాల్లో భారీ భహిరంగ సభలు నిర్వహిస్తారు.మొత్తం అయిదు విడతలుగా సాగే పర్యటనలో కనీసం 35నుంచి 40 ప్రచార సభల్లో మోడీ బీహార్లో ప్రజలని ఉద్దేశించి మాట్లాడతారు.


మొత్తం 243 సీట్లు ఉన్న బీహార్ అసంబ్లీ స్థానాలకి ప్రతీ ఆరు నియోజికవర్గాలకూ కలిపి మోడీ ఒక సభని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మధ్య కాలం లో ఎక్కడా ఇంతగా ఒక రాష్ట్ర ఎన్నికల మీద ఇంత ఫేం ఉన్న వ్యక్తి ప్రచారం చెయ్యడం జరిగి ఉండకపోవచ్చు. అంటే బీహార్ పట్ల మోడీ, ఆయన పార్టీ పెద్దలు ఎంత ఉత్సుకత తో ఉన్నారో అర్ధం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: