అధికారం లో ఉన్నప్పుడు మంత్రి పదవుల కోసం అధికారం కోల్పోయిన తరవాత పార్టీ పదవులకోసం అధినేతలు వెంపర్లాడుతూ ఉండడం సర్వ సాధారణం. పార్టీ అధికార పీఠం లో ఉన్న సమయం లో నామినేటెడ్‌ పోస్టులు అనీ, పార్టీ పదవులు అనీ చాలా మంది ఎగబడుతూ ఉంటారు. పార్టీ అధికారంలో లేకున్నా కూడా కొందరు నాయకులు తమ జిల్లాల్లో ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పార్టీ పదవుల్లో ఉండి డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి కూడా సిద్దం గా ఉండే వారిని చూస్తూ ఉంటాం.

 ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పరిస్థితి అచ్చం అదే


కానీ ఇక్కడ పరిస్థితి రివర్స్ అయ్యింది నాయకులే స్వయంగా తమ మీద ఏదో ఒక తప్పు ని కారణం గా చూపిస్తూ తమ పదవుల నుంచి వైదోలగేలా చెయ్యాలి అని వేడుకుంటూఉన్నారు. దాని కోసం లాబీయింగ్ లూ పైరవీ లూ చేసే పరిస్థితి కూడా వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పరిస్థితి అచ్చం అదే. అధికారంగా కాకపోయినా రఘువీరా మీద పేలుతున్న జోకులూ, వస్తున్న పుకార్లూ అలాగే ఉన్నాయి. 


రఘువీరా రెడ్డి సార్వత్రిక ఎన్నికలకి ముందు సమయం లో పార్టీ చీఫ్ గా నియమించబడ్డారు. రాష్ట్రాలు విడిపోయిన నేపధ్యం లో జనాలు కాంగ్రెస్ ని ఏపీ లో చిత్తు చిత్తు గా ఓడించగా రాష్ట్రంలో ఘోరపరాజయం చెందేలా నడిపించిన సారధిగా.. తన తప్పిదం ఏమాత్రం లేకపోయినా.. అపకీర్తిని మూటగట్టుకున్నారు రఘువీరా. అప్పటి నుంచీ భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ ని పైకి లేపే కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా రఘువీరా చేయ్యగాలిగినది ఏమీ లేదు. నెమ్మదిగా ఈ గుదిబండ లాంటి పదవి నుంచి తప్పించుకుందాం అని ఆయన ప్లాన్ లు వేస్తున్నారు.


రాష్ట్రం లో తన పదవి ని ఎవ్వరూ తీసుకోకపోగా తీసుకొమ్మని చిరంజీవి లాంటి వారికి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినా అలాంటి వారు  తిరస్కరిస్తున్నారు. దీంతో రఘువీరారెడ్డి తన భుజస్కందాల మీద గుదిబండలా ఉన్న ఈ భారాన్ని తగ్గించుకోవడం ఎలా అని తీవ్రంగా కుస్తీలు పడుతున్నారు. దీని మీద రకరకాల జోకులు వేసుకుంటున్నారు కింద స్థాయి నాయకులు. ఎదో ఒక తప్పును తనమీద వేసేసి ఈ పదవి పీకేయండి అని కోరుతున్నారట. చివరకి మొన్నామధ్య తారాజువ్వలకు పావురాలను కట్టి రఘువీరా సమక్షంలో వాటిని గాల్లోకి వదిలి చావడానికి కారణమైన ఇష్యూ లో తనని దోషిగా చేసి ఆ కారణం చూపైనా పదవి పెకేయమని రఘువీరా కోరి ఉంటారు అని జోకులు పేల్తున్నాయి 



మరింత సమాచారం తెలుసుకోండి: