తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు సజావుగా సాగాయని చెప్పుకొవ‌చ్చు. కానీ ప్ర‌తిప‌క్షాల నాయ‌కుల స‌స్పెన్ష‌న్ తో కొంత వ‌ర‌కు అధికార పార్టీకి మైన‌స్సె అయినా.. అసెంబ్లీ సాక్షిగా అధికార ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాల‌నుకుందో దానిని ప్ర‌జ‌ల ముందు పెట్టింద‌నే చెప్పాలి. అయితే అధికార పార్టీ ఆధినేత‌, సీఎం  కేసీఆర్ వ్య‌వ‌హారం తీవ్ర ఆగ్ర‌హానికి గురైనా ప్ర‌తిప‌క్షాలు ప్ర‌జాక్షేత్రంలో కి వెళ్లి, ఎండ‌గ‌ట్టే ప‌నిలో ప‌డితే.. కేసీఆర్ మాత్రం అసెంబ్లీ నే వేదిక‌గా చేసుకుని త‌న పంథాను నెగ్గించుకున్నారు. ప్ర‌జ‌ల‌కు ఏ స‌మ‌స్య‌ల‌తో బాద‌ప‌డుతున్నారు. వారికి ఏం కావాలో మాకు తెలుసున‌ని, 12 సంవ‌త్సరాల పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఏలా అభివృద్ధి చేయాలో మా పార్టీకే తెలుసున‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతేకాదు ప్ర‌తిప‌క్షాల అవ‌న‌స‌రంగా రాధ్ధాంతం చేస్తున్నాయ‌ని ఫైర్ ఆయ్యారు. దేశంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌ని విధంగా మా ప్ర‌భుత్వం అభివృధ్ది కార్య‌క్ర‌మాలు చేస్తున్నామ‌ని తెలిపారు. 

కేసీఆర్ కంఠం లో ప్రాణం ఉండ‌గా త‌ప్పులు  జ‌ర‌గ‌నివ్వ‌ను


కేసీఆర్ కంఠం లో ప్రాణం ఉండ‌గా త‌ప్పులు  జ‌ర‌గ‌నివ్వ‌ను. తెలంగాణ అభివృద్దికి ఇప్పుడే పునాదులు వేస్తున్నాం ప్రాణాలు అడ్డుపెట్టి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కాపాడుకుంటామ‌ని సీఎం కేసీఆర్ అసెంబ్లీ లో స‌మావేశంలో అన్నారు. రుణ మాఫీ పై విప‌క్షాలు అర్దంలేని రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని, మెడ‌పై క‌త్తిపెట్టి అల‌వికాని కోరిక‌లు అప్పుడే తీర్చ‌ర‌మంటే ఎలా అని ప్ర‌తిపక్షాల పై ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణలో కొత్త చ‌రిత్ర ప్రారంభ‌మైంద‌నీ భ‌విష్య‌త్ త‌రాలు స్ప‌ష్టం చేశారు. ఈ రోజు రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డానికి కార‌ణం గ‌త 58 ఏళ్లు గా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీటీడీపీలేన‌ని చెప్పారు. వాస్త‌వానికి రైతుల అత్మ‌హ‌త్య‌లు ఈనాటివి కాద‌న్న‌ది వాస్త‌వ‌మే. కాక‌పోతే అధికారంలో ఉన్న పార్టీలు ఏవ‌రైనా రైతులకు భరోసానిచ్చే కార్య‌క్ర‌మాలు మాత్రం చేయాలి. ఇక‌పోతే.. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఎన్నిక‌ల మేనిఫెస్టో లో సైతం లేని అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రం వ‌చ్చి 15 నెల‌లు ముగిస్తున్న నేప‌థ్యంలో పాల‌న పర‌మైన స‌మ‌స్య‌లు అదిగ‌మించడానికి కొంత‌వ‌ర‌కు స‌మ‌యం కావాల్సి ఉంటుంది.  


ఇక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధి ప‌నులు, వాటికి కేటాయించిన నిధుల వివ‌రాలు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. గిర‌జ‌నుల సంక్షేమం కోసం ప్ర‌భుత్వం రూ.5,036 కోట్లు ఖ‌ర్చు చేస్తుంద‌ని అన్నారు. ద‌ళితుల కోసం రూ. 8,089 కోట్లను ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు తెలిపారు. బీసీల సంక్షేమం కోసం రూ.2.172 కోట్లు, మైనారిటీ లో సంక్షేమం కోసం రూ. 1,105 కోట్లు, న్యాయ‌వాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు, జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం రూ. 10 కోట్లు, మ‌హిళా శిశు సంక్షేమం కోసం రూ. 2,037 కోట్లు కేటాయించామ‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. గ‌త పాల‌న‌లో ఇంత పెద్ద మొత్తం లో నిధుల కేటాయింపు లేద‌ని సీఎం కేసీఆర్ వాదించారు. మా పార్టీ అధికారంలోకి వ‌చ్చాకా న్యాయ‌వాదులు, జ‌ర్న‌లిస్టు లు సంక్షేమం నిదులు కేటాయించామ‌ని గుర్తుచేశారు. నిదుల దుర్వినియోగం కాకుండా పార‌ద‌ర్శ‌క పాల‌న ను ప్ర‌జ‌ల‌కు అందించ‌నున్నామ‌ని కేసీఆర్ గుర్తుచేశారు. 


అంతేకాకుండా రూ. 4,055 కోట్ల‌తో 65 వేల ఇళ్లు నిర్మించ‌బోతున్నామ‌ని సీఎం ఉద్ఘాటించారు. గతంలో సంక్షేమానికి 13,572 కోట్లు ఖ‌ర్చు చేస్తే ఇప్పుడు 33,986  కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని తెలిపారు. ఎవ‌రూ అడ‌గ‌క‌పోయినా పెద్ద మ‌న‌సుతో హాస్ట‌ళ్ల‌కు స‌న్న బియ్యం ఇస్తున్నామ‌ని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో కాలేజీ  విద్యార్ధుల‌కు సైతం స‌న్న బియ్యం స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. గతంలో ఎవ‌రూ ఊహించ‌ని అభివృద్ది ని చేసి చూపించామ‌ని అన్నారు. మేనిపేస్టోలో లేని అనేక విష‌యాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తెలుసుకుని సంక్షేమ ప‌థ‌కాల‌ను అమలు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. బీడీ కార్మికుల‌కు ల‌కు నెల‌కు రూ 100 భృతిని ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఇక‌పోతే గ‌త ప్ర‌భుత్వాలు హాస్ట‌ల్ విద్యార్ధుల‌కు స‌న్న బియ్యం ఇవ్వాల‌న్న అలోచ‌న కూడా రాలేద‌న్న‌ది నిజ‌మే అయినా ఇప్ప‌టి ప్ర‌భుత్వం ఇలాంటి నిర్ణయాన్ని స్వాగ‌తిస్తూనే..మ‌రోవైపు ఈ ప‌థ‌కాన్ని క్షేత్ర స్థాయిలో వెళ్లితే గాని తెలంగాణ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు న్యాయం జరిగేలాలేవు. ఇక బీడీ కార్మికులకు భృతి ని ఇస్తున్న‌ట్లు తెలిపిన ప్ర‌భుత్వం అమలు విష‌యాన్ని సైతం చెప్పాల్సిన అవ‌సరం ఉంది. 


ఇక‌పోతే.. గ‌ర్భీణీ స్త్రీల విష‌యానికి వస్తే.. ప్ర‌భుత్వం ఆరోగ్య ల‌క్ష్మి ప‌థ‌కం కింద ప్ర‌తిరోజు పాలు,గుడ్లు ఇస్తున్నామ‌ని అన్నారు. ఆర్థిక స్థితిగ‌తులు ఇంకా పూర్తి స్థాయిలో ఆర్ధం కాలేద‌న్న సీఎం ఫైనాన్సియ‌ల్ ట్రెండ్స్ బాగున్నాయన్నారు. అందుకోస‌మే.. సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌ల‌వుతున్నాయన్నారు. వ‌చ్చే పంచాయితీ రాజ్ ఎన్నిక‌ల నాటికి తండాల‌న్నీ గ్రామ పంచాయితీలు అవుతాయన్నారు. ఆర్టీసీ , సింగ‌రేణి కార్మిక‌లు అనేక సమస్య‌ల‌కు పరిష్కారాలు వెతికామ‌ని తెలిపారు. వ‌క్ప్ బోర్డు, మైనార్టీ వెల్పేర్ లో త‌గినంత స్టాప్ లేద‌ని... త్వ‌ర‌లో సిబ్బందిని భ‌ర్తీ చేస్తామ‌ని హామీ నిచ్చారు సీఎం కేసీఆర్.  ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. గ‌త 15 నెల‌ల కాలంగా కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇంతా అంతాకాదు. ఇందులో కొన్ని ఇప్ప‌టికి ప్ర‌స్తావ‌న‌కు రానివెన్నో.. అంతేకాకుండా కొన్ని ప‌నులు వెన‌క్కు తీసుకున్నారు కూడా. ఇక‌పోతే అసలు గుర్తుంచుకొవాల్సిన విష‌య‌మేటింటే? రాష్ట్రం కొత్త‌గా ఏర్ప‌డింది కావునా.. అభివృద్ది అనేది ఇప్ప‌ట్టో సాద్యం కాద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. దీనిని అధికాపార్టీ యేకాకుండా, ప్ర‌తి ప‌క్షాలు కూడా గుర్తుంచుకుంటే బాగుంటుంది.


అడ‌పాద‌డ‌పా అధికార టీఆర్ఎస్ కొన్ని కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నా.. కొన్ని విఫ‌ల‌మైనా అందులో కొన్ని సక్సెస్ పుల్ గానే నిర్వ‌హిస్తుంది. గ్రామ‌జ్యోతి, మిష‌న్ కాక‌తీయ‌, వాట‌ర్ గ్రిడ్ లాంటి ప‌థ‌కాల‌కు మంచి ఆద‌ర‌ణే ల‌భించింది.  రైతు ఆత్మ‌హ‌త్య ల విష‌యంలో మాత్రం కేసీఆర్ ప్ర‌భుత్వం రైతుల‌కు భ‌రోసా ఇవ్వ‌డంలో విఫ‌ల‌మైంద‌ని రాజకీయ మేదావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎదిఎమైనా అసెంబ్లీ స‌మావేశాలను మాత్రం అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మంచిగానే వాడుకుంద‌ని చెప్పాలి. అన్ని ప‌క్క‌న పెడితే కేసీఆర్ అభివృద్ది ఫ‌థ‌కాలు అమ‌లు చేసి ప్ర‌జ‌ల‌కు అందేలా చేస్తే..అంత‌కంటే ఇకేం కావాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: