చాలా సందర్భాలలో తలనొప్పికి గల కారణం తెలియక పోవ చ్చు. కారణంను గుర్తించుట కూడా సాధ్యం కాకపోవచ్చు. కొన్ని కుటుంబాలలో వంశపారపర్యంగా కూడా తలనొప్పి లేదా మైగ్రేన్‌ వచ్చుచున్నట్లు గమనించదగ్గ అంశం.ఒక సిధ్ధాంతం ప్రకారం తలలోని రక్తనాళములలో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుట మూలంగా వస్తున్నట్లు వాదన. స్తుత కాలంటో పని ఒత్తిడి, టెన్షన్, నిద్రలేమి, జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది.

తలనొప్పికి కారణాలేవైనా వాటి నివారణకు సత్వర చికిత్స చేయించుకోవాలి. లేకుంటే కొన్ని రకాల తలనొప్పులు రోగికి ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదముంది. తలనొప్పికి కారణాలేవైనా కావచ్చు, దాని ఎఫెక్ట్ మాత్రం మామూలుగా ఉండదు. అందుకే మనలో చాలామంది తలనొప్పి లక్షణాలు కనబడగానే తొందరపడి ఇష్టం వచ్చిన టాబ్లెట్ లు వేసుకుంటుంటారు, అవి తాత్కాలింగా ఉపశమనం కలిగించినా ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్ లు కూడా కలిగిస్తాయి. యూరిమియాతో నెఫ్రైటిస్‌, పిత్తాశయ రోగములు, కామెర్లు రుమాటిజమ్‌, డయాబెటిస్‌, జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువ అగుట వంటి వ్యవస్థాగత కారణాలు. మరి తలనొప్పి తగ్గించుకునే మార్గలు తెలుసుకుందామా..!
 

తలనొప్పి చిరాకు తెప్పిస్తుందనుకుంటే కాసేపు అన్ని పనులను పక్కన పెట్టేసి రిలాక్స్ అవ్వడం మేలు. దీనివల్ల అలసట తగ్గి తలనొప్పి హుష్కాకి అయిపోతుంది. 

ఒక్కోసారి మనం తీసుకునే ఆహారం కూడా మన తలనొప్పికి కారణమవ్వచ్చు. కాబట్టి మీ ఆహార పద్ధతులను మార్చేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. 

ఒక్కోసారి విపరీతమైన తలనొప్పికి డీ హైడ్రేషన్ కూడా కారణమవ్వచ్చు. అందుకని ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్ళు తాగండి. అంతే తలనొప్పి తగ్గుముఖం పట్టడం మీరు గమనిస్తారు 

కాల్షియం సప్లిమెంట్ వల్ల రక్తప్రసరణ జరిగి మీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఒక గ్లాసు నిండా పాలు లేదా ఆరెంజ్ జ్యూస్ తాగడం లేదా మెగ్నీషియం, కాల్షియం ఉండే సప్లిమెంట్ తీసుకున్నా తలనొప్పి నుండి రిలీఫ్ ని ఇస్తుంది.

 మన అరచేతిలో ముఖ్యంగా మన చూపుడు వేలుకు, బొటన వేలుకు మధ్య ఉండే ప్రదేశంలో కరెక్టుగా ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. వాటిని 2, 3 నిమిషాల పాటు నొక్కి ఉంచినట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది. 

సాధారణ తలనొప్పి ఉన్నవాళ్ళకు ఇది మంచి చిట్కా, అనువైన ఎక్సర్ సైజు ను ఎంచుకుని చేయడం మంచిది. తద్వారా శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి తలనొప్పి తగ్గే అవకాశాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: