బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు ప్రధాని మోదీపై మళ్లీ కోపమొచ్చింది. రాష్ట్ర శాసనసభకు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీ సిద్ధించనున్నదని సర్వేలు సూచిస్తున్న నేపథ్యంలో మోదీ మత తత్వం నితీశ్‌కు మళ్లీ గుర్తొచ్చింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి రాజధర్మాన్ని పాటించాలంటూ మోదీకి ఎందుకు చెప్పారో అంతా ఒకసారి ఆలోచించాలని నితీష్ ఎద్దేవా చేశారు.


2002 లో మత ఘర్షణలు చోటు చేసుకున్న అనంతరం గుజరాత్ కు విచ్చేసిన ఆనాటి ప్రధాని వాజ్ పేయి రాజధర్మం పాటించాలంటూ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీకి సూచించడం వెనుక ఉన్న అర్ధమేమిటని నితీష్ ప్రశ్నించారు. రాజుగా ఉన్నవాడు ప్రజలందరినీ సమానంగా చూడాలే తప్ప.. ముస్లింలకు అన్యాయం జరిగేలా చేయరాదని అర్థం వచ్చేలా అప్పట్లోవాజపేయి.. అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోడీ కు హితబోధ చేశారని వార్తలు వచ్చాయి. వాటి గురించే ఇప్పుడు నితీశ్ అన్యాపదేశంగా హెచ్చరిస్తున్నారు.


ఈ గత చరిత్ర స్మరణ బాగానే ఉంది కానీ, అసెంబ్లీ ఎన్నికలకు మతం రంగు పులిమేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్న నితీశ్ మరోవైపున బీహార్ రాజకీయాలను కంపు చేస్తున్న కులం రంగు గురించి కూడా ఆలోచించి ఉంటే బాగుండేది కదా... బీహార్‌లో కులాల కుంపట్లు వెలిగించి గత పాతికేళ్లుగా రాజ్యం వెలగబెడుతున్న ఘనచరిత్రలో తన పాత్ర గురించి కూడా నితీశ్ ఒకసారి వెనక్కు చూసుకుంటే బాగుండేది కదా.. ప్రజలను అటు మతపరంగానో లేక ఇటు కులపరంగానో వేరుచేసి ఆడుతున్న షోలో మీరూ భాగస్వాములే కదా అనేది జనాంతికం.


మరింత సమాచారం తెలుసుకోండి: