ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రత్యేక హోదాపై నిరాహారదీక్ష చేస్తున్నారు. తనకు దొరికిన ప్రత్యేక హోదా అనే అంకుశాన్ని బాగా వినియోగించు కుంటున్నానని మురిసిపోతున్నారు.. చంద్రబాబు సర్కారు హోదా కోసం గట్టిగా ప్రయత్నించడం లేదని విమర్శిస్తున్నారు. నిజమే.. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం అనే అంశం సెంటిమెంట్ తో కూడినదే.. ఆ రకంగా జగన్ స్ట్రాటజీ కరెక్టే..

కానీ కొన్ని కారణాల వల్ల జగన్ కేంద్రంపై గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. గట్టిగా నిలదీయలేకపోతున్నారు. మరోవైపు జగన్ ప్రత్యేక హోదా దీక్ష అటు బీజేపీనీ ఇబ్బంది పెడుతోంది. అందుకే బీజేపీ నేతలు గొంతువిప్పుతున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అయితే జగన్ తీరుపై సుతిమెత్తగా విమర్శించారు. జగన్ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అంటూ అనవసరమైన రాద్దాంతం చేస్తున్నాడన్నారు. 

కేంద్రం ఏపీకి ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులు ఇప్పటికే ఇచ్చిందని.. వాటిని బాబు సద్వినియోగం చేయడం లేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అదే విషయాన్ని సోము వీర్రాజు ప్రెస్ మీట్లో చెప్పారు. బీజేపీ ఇప్పటివరకూ ఏపీకి ఏడాదిన్నర కాలంలో లక్ష కోట్లకు పైగా నిధులు వివిధ పద్దుల్లో అందజేసిందని.. కానీ వాటిని చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నాడని ఆయన అన్నారు. 

తాము మిత్రపక్షం కావడం వల్లే ఇలాంటి విషయాలు మాట్లాడలేకపోతున్నామని.. ప్రతిపక్షనేతగా జగన్ ఈ విషయాలన్నీ బయటపెట్టాలని సూచించారు సోము వీర్రాజు. కేంద్రనిధులను చంద్రబాబు సర్కారు ఖాతాల్లో వేసుకుని వడ్డీలు వసూలు చేసుకుంటున్నారని విమర్సించారు. జగన్ ప్రత్యేక హోదా అంశం పక్కకు పెట్టి.. ఇలాంటి విషయాలపై పోరాడాలని సలహా ఇచ్చారు సోము వీర్రాజు.. జగన్ వింటున్నావా..!? 


మరింత సమాచారం తెలుసుకోండి: