ఏపీ ప్రతిపక్షనేత జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ చేస్తున్న దీక్ష మూడో రోజుకు చేరుకుంది. తొలిరోజు దీక్షాస్థలం అభిమానులతో ప్రాంగణం కిక్కిరిసింది. ఆ అభిమానం రెండోరోజూ కొనసాగింది. ఐతే.. జగన్ దీక్షకు మీడియా కవరేజ్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. జగన్ మొదటి రోజు మాట్లాడిన ప్రసంగం మాత్రం బాగానే అన్ని ఛానళ్లూ కవర్ చేశాయి. 

ఐతే.. జగన్ చేస్తున్నది నిరాహారదీక్ష కావడంతో ఎక్కువగా ప్రసంగించడానికి వీలు లేదు. అడపాదడపా నాయకులు ప్రసంగించినా వారి లైవ్ లు మిగిలిన ఛానళ్లు కవర్ చేయలేదు. సొంత ఛానల్ సాక్షి మాత్రం దీక్షగా దీక్షను కవర్ చేస్తోంది. నేతలు మాట్లాడినంతా లైవ్ ఇస్తోంది. సొంత నాయకుడి కవరేజీలో తరించిపోతుంది. 

కానీ ఎంత సొంత ఛానలైనా ఎంత సేపని లైవ్ ఇవ్వగలదు.. పోనీ..ఇవ్వకుండా ఆపడమూ కుదరదు.. అందుకే ఈ సారి సాక్షి కాస్త క్రియేటివ్ గా ఆలోచించింది. జగన్ దీక్షపై జనం అభిప్రాయాలను వాట్సప్, వీడియోల రూపంలో సేకరించి ప్రసారం చేస్తోంది. 

అలా ప్రసారం చేసే వీడియోల్లోనూ అన్ని వర్గాలనూ కవర్ చేసింది. లైవ్ ఓ పక్క ప్రసారం చేస్తూనే బాక్సుల్లో జనం స్పందనగా వాట్సప్ వీడియోలను ప్రసారం చేస్తోంది. దీంతో జగన్ ను పొగుడుతూ జనం చేసే భజన ఓవైపు.. లైవ్ కవరేజీ మరోవైపు.. ఉభయతారకంగా ఉంది. ఎంతసేపూ మనం చెప్పడమే కాకుండా.. అవే మాటలు జనం చేత చెప్పిస్తే ఆ ఎఫెక్ట్ వేరే ఉంటుందన్న సంగతి సాక్షి గ్రహించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: