తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత విభజన సమయంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు.. అయితే ఇది కేవలం పది సంవత్సరాల వరకు మాత్రమే..తర్వాత ఆంధ్రప్రదేశ్ స్వంత రాజధానికి మారాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏపీ రాజధానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ద పెట్టారు..ప్రపంచం గర్వించదగ్గ రాజధాని ఏర్పాటు చేయాలని ధృఢ సంకల్పంతో ఉన్నారు..ఇప్పటికే రాజధాని పేరు ‘అమరావతి’ అని నిర్ణయించారు. ఆ మద్య ఆంద్రప్రదేశ్ రాజదాని అమరావతికి సబందించి ఊహాచిత్రాలను ప్రభుత్వం విడుదల చేశారు. కొత్త గా నిర్మించ బోయే రాజధానిలా చాలా ప్రత్యేకతలు ఉంటాయని బాబు చెబుతున్నారు. అరవై లక్షల మందికి నివాసానికి అనువుగా ఉండేలా ఈ ప్రణాళిక సిద్దం చేసినట్లు చెబుతున్నారు. పర్యావరణం,సమర్ధ రవాణ వ్యవస్థ మొదలైనవి ఉండేలా ప్లాన్ చేస్తున్నామని చెబుతున్నారు.


ఇక చారిత్రక స్థలం బౌద్దారామంగా పేరొందిన అమరావతి పట్టణానికి సమీపంలో ఏర్పాటవుతున్న ఈ రాజధానికి అమరావతి పేరు పెట్టడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో బౌద్దమత ప్రముఖులను , ఇతరత్రా టూరిష్టులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం బావిస్తోంది. తాజాగా  అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.  అంతే కాదు ఈ నెల 13న ప్రతి ఊరి నుంచి మట్టి, నీరు సేకరించి రాజధానికి తీసుకురావాలని చెప్పారు. గ్రామాల నుంచి సేకరించిన మట్టి, నీరుతో స్మారకస్థూపం నిర్మించాలన్నారు.అమరావతి సంకల్ప జ్యోతి యాత్రలో యువకులు పాలుపంచుకోవాలని సీఎం కోరారు.


మరో వైపు అమరావతి ప్రారంభ వేడుక అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు..ఇందుకోసం తెలుగు ఇండస్ట్రీలో సినీ ప్రముఖులతో కూడా చర్చలు కొనసాగుతున్నాయట..వేడుకకు రాజీకీయ,సినీ,పారిశ్రామిక వేత్తలు హజరు కాబోతున్న సందర్భంలో కలర్ ఫుల్ గా కనిపించడానికి ఏమేం చేయొచ్చో సినీ దిగ్గజాల  దగ్గర సలహాలు తీసుకుంటున్నారు చంద్రబాబు. ఇందు కోసం  ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి, డైరెక్టర్స్ రాజమౌళీ, బోయపాటి శ్రీను సలహాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంట్రీ పాయింట్స్ దగ్గర్నుంచి మ్యూజిక్ వరకు అంతా సినిమా స్టైల్ లో  అదిరిపోయాలా ఉండాలని చెప్పారట.


బౌద్ద స్థూపం


ఇందులో భాగంగా ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కు కొన్ని పనులు కూడా అప్పజెప్పారట.. ఇక రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వారికోసం వారి త్యాగానికి గుర్తుగా ఒక పాట, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఖ్యాతి గురించి మరోపాట రూపొందించడానికి ఎంఎం కీరణవాణి, వందేమాతరం శ్రీనివాస్ ల సహకారం కూడా తీసుకోబోతున్నారట. మొదటి నుంచి పబ్లిసిటికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు నాయుడు అమరావతి ప్రారంభ వేడుకలు ప్రపంచం గుర్తించే లెవల్ లో చేయాలని నిశ్చయించారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: