భారత దేశంలో స్త్రీల మాన ప్రాణాలు కాపాడాల్సిన రక్షక భటులు రాక్షసుల్లా మారారు..తాము అసలు సభ్య సమాజంలో ఉన్నమా..లేదా అన్ని విషయం మరిచిపోయారు విచక్షణ కోల్పోయారు...భారత జాతికే అవమానం చేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే అసలు మనం సమాజంలో బతుకుతున్నామా..? లేదా అడవిలో కృర మృగాల మద్య బతుకుతున్నామా అన్న అనుమానం వస్తుంది.. సాధారణంగా సినిమాల్లో రాక్షత్వం ఉట్టిపడేలా పోలీస్ వాళ్లను చూపిస్తుంటారు..ఉత్తరప్రదేశ్ లోని దన్ కౌర్ పోలీసు స్టేషన్ పరిదిలో అంతకంటే దారుణం జరిగింది.

వివరాల్లోకి వెళితే..  ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ్‌బుద్దనగర్ ధన్‌కూర్ మార్కెట్‌లో ఈ అమానవీయ సంఘటన జరిగింది. సునీల్  గౌతమ్ అతని కుటుంబ సభ్యులు అతని బంధువులు తమ ఇంట్లో మోటారు సైకిల్, నగదు, ఫోన్లు దోచుకెళ్లారని ఫిర్యాదు చేయడానికి గురువారం నాడు దన్ కౌర్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు.  స్టేషన్ లో ఉన్న స్టేషన్ ఆఫీసర్ ప్రవీణ్ యాదవ్ కేసు నమోదు చేయడానికి నిరాకరించాడు. దీంతో కేసు ఎందుకు నమోదు చేయరు పోయిన వస్తువులు మాకు తిరిగి ఇప్పించండీ అంటూ అధికారిని నిలదశారు..అదే వారు చేసిన పాపం..పోలీసు అధికారి ప్రవీణ్ కు కోపమొచ్చింది. అంతే తాను మనిషిని అన్న విచక్షణ మరిచాడు.. తొటి పోలీసు వాళ్లతో ఆ కుంటుంబంపై విరుచుకు పడ్డారు.

సునీల్ ని అతని భార్యను అడ్డు వచ్చిన బందువులను కూడా ఇష్టమొచ్చినట్లు కొట్టుకుంటూ రొడ్డుపైకి ఈడ్చుకు వచ్చారు. సునీల్ భార్య చీరను లాగి పడేశారు. బట్టలు చించేశారు. అడ్డుపోయిన సునీల్ బట్టలు కూడా చించి పడేశారు. మహిళలను సైతం వివస్త్రం చేశారు. వందలాది లాది మంది చూస్తుండగా ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసులు అంతటితో ఊరుకోకుండా సునీల్ పై, అతని భార్యపై, బందువులపై క్రిమినల్ కేసులు బనాయించి జైలుకు పంపారు. . ఈ దాడి సంఘటనపై జర్నలిస్టులు ప్రవీణ్ యాదవ్ ను ప్రశ్నిస్తే అసలు అలాంతి వేమీ జరగలేదని. సునీల్ కుటుంభమే పోలీసులపై దాడికి ప్రయత్నించిందని అందుకే వారందరి పై క్రిమినల్ కేసులు పెట్టామని చెప్పాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: